నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది
టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్ చారిత్రాత్మక విజయం సాధించింది. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో ఓడించి కప్పును ముద్దాడింది. ముచ్చటగా మూడోసారి టీ20 వరల్డ్ కప్‌ను కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్ అయిదు వికెట్ల నష్టానికి 255 పరుగులు చేయగా, న్యూజిలాండ్ 19 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌట్ అయ్యింది. వరుస హాఫ్ సెంచరీలతో రాణించిన ఓపెనర్ సంజు శాంసన్ 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' అవార్డును గెలుచుకున్నాడు.
ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఫైనల్‌లో అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోయాడు గానీ, టోర్నమెంట్ మొత్తం మీద మెరుపులు మెరిపించాడు. ఈ మ్యాచ్ లో 18 పరుగులు, ఒక వికెట్ సాధించాడు. ఈ టోర్నమెంట్‌లో మొత్తం తొమ్మిది మ్యాచ్‌లను ఆడిన పాండ్యా.. 27.12 సగటుతో 217 పరుగులు చేశాడు. తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. భారత్ విజయం తర్వాత.. అతని ఆనందానికి హద్దులేకుండా పోయింది. జాతీయ పతకాన్ని కప్పుకొని గ్రౌండ్ మొత్తం కలియదిరిగాడు.

తన ప్రియురాలు మహికాతో కలిసి కనిపించాడు. ఆమెను ఆప్యాయంగా కౌగిలించుకుని ప్రేమను కురిపించాడు. ఈ క్రెడిట్ మొత్తం కూడా ఆమెకే ఇచ్చేశాడు హార్థిక్ పాండ్యా. 'మాహికా నా జీవితంలోకి వచ్చినప్పటి నుండి అంతా పూర్తిగా మారిపోయింది' అని వ్యాఖ్యానించాడు. తాను కష్టపడతానని, అందరితో కలుపుగోలుగా, మంచి మనిషిగా ఉంటానని, అందుకే చాలా మంది తనను ఇష్టపడతారని పేర్కొన్నాడు. తనకు అండగా నిలిచిన వారికి ధన్యవాదాలు తెలిపాడీ సందర్బంగా.
భారత జట్టుతో పాటు మాజీ క్రికెటర్లు మోహిత్ శర్మ, మురళీ కార్తీక్, ఫిజియోథెరపిస్ట్, సెక్యూరిటీ సిబ్బంది, న్యూట్రిషనిస్ట్ నిఖిల్, ట్రైనర్ సాగర్, చెఫ్ విజయ్.. ఇలా అందరూ తాను సక్సెస్ కావడానికి పూర్తిగా సహకరించిన వాళ్లేనని చెప్పాడు. కేరీర్ లో రాణించడానికి వీరందరూ అద్భుతమైన కృషి చేశారని కితాబిచ్చాడు. ఇప్పుడు మీరు చూస్తోన్న ఈ హార్దిక్ పాండ్యా ఇలా ఎదగడానికి.. తెరవెనుక నుండి వీరందరూ అందించిన అద్భుతమైన సహకారం వల్లే సాధ్యమైందని పాండ్యా వివరించాడు.
ప్రత్యేకించి గర్ల్ ఫ్రెండ్ మహికాను పొగడ్తల్లో ముంచెత్తాడు. తన జీవితంలోకి మాహికా అడుగుపెట్టినప్పటి నుండీ.. దృష్టి అంతా గెలవడంపైనే ఉందని పేర్కొన్నాడు. తాను జీవితంలో, క్రికెట్ లో ఎలా ముందుకు వెళ్లాలి అనే విషయంపై స్పష్టమైన గైడెన్స్ మహికా ఇచ్చారని చెప్పాడు. ఆమెతో పాటు సపోర్టింగ్ స్టాఫ్, స్నేహితులు లేకుంటే ఇక్కడి దాకా వచ్చేవాడిని కాదని చెప్పాడు. ఇక్కడితో తాను ఆగిపోదలచుకోలేదని, ఇంకో 10 ట్రోఫీలను చేరుకోవలనేదే తన గమ్యమని స్పష్టం చేశాడు.
వచ్చే దశాబ్దంలో ఈ ఘనత సాధిస్తానని ధీమా వ్యక్తం చేశాడు. సీనియర్ ప్లేయర్ అనే సౌండ్ వినడానికి బాగుంది గానీ.. ఇంకా పదేళ్ల క్రికెట్ ఆడాల్సి ఉందని హార్ధిక్ పాండ్యా చెప్పాడు. ఇప్పటివరకు తాను ఆడింది సగం కెరీర్ మాత్రమేనని ఇంకా హాఫ్ పార్ట్ మిగిలి ఉందని చెప్పాడు. ఐసీసీ, ఐపీఎల్ కలిపి మొత్తం 10 ట్రోఫీలు గెలవాలని కోరుకుంటున్నానని, అన్నింటికంటే ఐసీసీ ట్రోఫీలే తనకు అత్యంత ముఖ్యమని పేర్కొన్నాడు. వచ్చే అయిదు, పదేళ్లలో మరో అయిదు లేదా ఆరు ట్రోఫీలను గెలుస్తానని చెప్పాడు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications