Manchu Lakshmiprasanna: పెద్ద మనస్సు చాటుకున్న మంచు లక్ష్మి.. 30 ప్రభుత్వ స్కూళ్ల దత్తాత..
ప్రముఖ టాలీవుడ్ ప్రముఖుడు మంచు మోహన్ బాబు తనయ, సినీ నటి, టీచ్ ఫర్ చేంజ్ స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ మంచు లక్ష్మీ ప్రసన్న పెద్ద మనస్సు చాటుకున్న. ఆమె ప్రభుత్వ పాఠశాలలను దత్తాత తీసుకోవడానికి ముందుకొచ్చారు. జోగులాంబ గద్వాల జిల్లాల్లో 30 పాఠశాలలను దత్తత తీసుకున్నాట్లు ప్రకటించారు.
ప్రభుత్వ పాఠశాలలోని పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే తన లక్ష్యమని మంచి లక్ష్మీప్రసన్న స్పష్టం చేశారు.బుధవారం గద్వాల కలెక్టరేట్ కి వచ్చిన ఆమె కలెక్టర్ వల్లూరు క్రాంతితో భేటీ అయ్యారు. స్కూళ్ల దత్తతకు సంబంధించిన ఫైళ్లపై సంతకాలు చేశారు. తాము దత్తత తీసుకున్నజిల్లాలోని 30 ప్రభుత్వ స్కూళ్లలో డిజిటల్ ఎడ్యుకేషన్, కంప్యూటర్ క్లాసెస్, మౌలిక వసతులు ఏర్పాట్లు చేస్తామని లక్ష్మి తెలిపారు.

ఇవన్నీ ఆగస్టు వరకు పనులు పూర్తయ్యేలా కృషి చేస్తామని చెప్పారు. ఇప్పటికే యాదాద్రి జిల్లాలో 56 స్కూళ్లను దత్తత తీసుకుని మౌలిక వసతులు కల్పించామన్నారు. మంచు లక్ష్మికి కలెక్టర్ క్రాంతి కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాలలు దత్తాత తీసుకోవడం మంచిపరిణామమని అన్నారు. ఇతర సెలబ్రెటీలు కూడా పాఠశాలలను దత్తాత తీసుకోవడం వల్ల పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుని పలువురు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications