Lok Sabha Election 2024: కాంగ్రెస్‍లో లోక్ సభ స్థానాలకు భారీ డిమాండ్..
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ లో లోక్ సభ టికెట్ భారీగా పోటీ నెలకొంది. కాంగ్రెస్ లోక్ సభకు పోటీ చేయాలనుకునే వారి నుంచి దరఖాస్తులు స్వీకరించింది. దరఖాస్తులను బుధవారం నుంచి శనివారం వరకు స్వీకరించారు. మొత్తం 17 పార్లమెంట్ స్థానాలకు 306 అప్లికేషన్లు వచ్చాయి. మొదిటి రోజు 7 దరఖాస్తులు వచ్చాయి.రెండో రోజు 34, మూడో 100, నాలుగో రోజు 165 అప్లికేషన్లు వచ్చాయి.
అప్లికేషన్లు ఇచ్చిన వారిలో ఖమ్మం నుంచి పోటీ చేయడానికి డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య మల్లు నందిని, కుసుమ కుమార్ దరఖాస్తు చేశారు. పెద్దపల్లి నుంచి బరిలో దిగేందుకు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కుమారుడు వింశీ కృష్ణ దరఖాస్తు చేసుకున్నారు. వరంగల్ లో పోటీ చేసేందుకు మెత్కుపల్లి నర్సింహులు, సికింద్రాబాద్ నుంచి అంజన్ కుమార్ యాదవ్ అనిల్ కుమార్, సామా రామ్మోహన్ రెడ్డి, కోదండరెడ్డి అప్లికేష్ ఇచ్చారు. కరీంనగర్ నుంచి పోటీ చేసేందుకు రమ్యారావు దరఖాస్తు చేసుకోగా.. నల్గొండ నుంచి పటెల్ రమేష్ రెడ్డి అప్లికేషన్ పెట్టారు.

మహబూబాబాద్ నుంచి పోటీ చేసేందుకు బలరాం నాయక్, బెల్లయ్య నాయక్ పోటి పడుతుండగా.. భువనగిరి లోక్ సభ స్థానం కోసం కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, బండి సుధాకర్ గౌడ్ దరఖాస్తు చేశారు. ఖమ్మం టికెట్ కోసం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తమ్ముడు ప్రసాద్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కుమారుడు యుగేందర్ కోసం టికెట్ ప్రయత్నాలు జరుగుతోన్నాయి. నల్గొండ టికెట్ కోసం కూడా పోటీ గట్టిగానే ఉంది. మంత్రి వెంకట్ రెడ్డి అన్న కొడుకు సూర్య పవన్ రెడ్డి, చల్లూరి మురళీధర్ రెడ్డి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.
భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి, తీన్మార్ మల్లన్న, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ రెడ్డి పోటీ పడుతున్నారు. మాల్కజ్ గిరి నుంచి కపిలవాయి దీలిప్ కుమార్, బండ్ల గణేష్ పోటీ పడుతున్నారు.












Click it and Unblock the Notifications