పెద్దపల్లిలో గూడ్స్ బోల్తా - రైళ్ల రద్దు, దారి మళ్లింపు..!!

తెలంగాణలోని పెద్దపల్లి- రామగుండం స్టేషన్ల మధ్య గూడ్స్‌ రైలు బోల్తా పడింది. రాఘవాపూర్ వద్ద అదుపు తప్పిన గూడ్స్‌ రైలు కారణంగా ఈ మార్గంలో రైళ్ల రాకపోకలపైన ప్రభావం పడింది. ఈ కారణంగా రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో, వెంటనే రైల్వే అధికారులు రంగంలోకి దిగారు. పట్టాల పైన ఉన్న బోగీలను తెలిగించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీ - చెన్నై మార్గంలో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.

పెద్దపల్లి- రామగుండం స్టేషన్ల మధ్య రాఘవాపూర్ వద్ద ఐరన్‌ కాయిల్స్‌తో వెళ్తున్న రైలు ఓవర్‌ లోడ్‌తో 11 వ్యాగిన్లు బోల్తా పడింది. ఘజియాబాద్‌ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు ఓవర్ లోడ్‌తో పట్టాలపై అర్ద్రరాత్రి బోల్తా పడింది. దీని కారణంగా.. దిల్లీ, చెన్నై మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 11 వ్యాగిన్లు అప్‌ అండ్‌ డౌన్‌ మార్గాలపై పడటంతో రైళ్ల రాకపోకలు నిలిపివేసారు. త్రిబుల్‌ లైన్‌ మధ్య లోనుంచి వెళ్తున్న గూడ్స్‌ రైలు బోల్తా పడినట్లు అధికారులు వెల్లడించారు. ఢిల్లీ వెళ్లే సంపర్క్ కాంత్రి ఎక్స్‌ప్రెస్‌ పెద్దపల్లిలో నిలిచిపోయింది. మూడు ట్రాక్ లు దెబ్బ తినటంతో 20 రైళ్ల రద్దు చేయటంతో పాటుగా 18 రైళ్లను దారి మళ్లించారు.

Many trains delay due to goods derail between Peddapalli and Ramgundam

ప్రమాదం జరిగిన ప్రాంతం పూర్తిగా చీకటిగా ఉండటంతో తాత్కాలిక లైట్లు ఏర్పాటు చేసి బోగీలను తెలిగించే చర్యలు ప్రారంభించారు. గూడ్స్ రైలు పట్టాలు తప్పిన ఘటన పై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరా తీసారు. సమాచారం తెలిసిన వెంటనే దక్షిణ మధ్య రైల్వే అధికారులకు ఫోన్ చేసిన బండి సంజయ్ ప్రమాదానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. పట్టాలు దెబ్బతినడంతో 3 రైల్వే ట్రాక్‌లు దెబ్బతిన్నాయని అధికారులు వివరించారు. రాకపోకలకు పూర్తిగా అంతరాయం ఏర్పడిందని వెల్లడించారు. అధికారులు, సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+