తెలంగాణా సీఎం కేసీఆర్ కు మావోల హెచ్చరిక .. నీ వైఖరి మార్చుకో .. లేకుంటే ...

తెలంగాణ సీఎం కేసీఆర్ కు మావోయిస్టులు వార్నింగ్ ఇచ్చారు. హరితహారం పేరుతో కేసీఆర్ ప్రభుత్వం ఆదివాసీల భూములు కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తోంది అంటూ ఆరోపిస్తున్న మావోయిస్టులు కెసిఆర్ కు హెచ్చరికలు జారీ చేస్తూ లేఖ రాశారు. నిన్న మొన్నటి దాకా సైలెంట్ గా ఉన్న మావోయిస్టులు చాపకింద నీరులా విస్తరిస్తూ తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారని తాజా తాజా లేఖతో తేటతెల్లమౌతుంది.

మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ పేరిట లేఖ విడుదల చేసిన మావోలు దశాబ్దాలుగా ఆదివాసీలు సాగుచేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇస్తానని కెసిఆర్ వారికి పట్టాలు ఇవ్వకుండా మోసం చేశారని ఆరోపించారు. రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటికీ కెసిఆర్ ఆదివాసీలను పట్టించుకోవడంలేదని, పట్టాలు ఇవ్వకుండా మాట తప్పారని లేఖలో పేర్కొన్నారు. కేసీఆర్ ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకోవాలని లేదంటే పర్యవసానం తీవ్రంగా ఉంటుంది అంటూ మావోలు తెలంగాణ సీఎం కేసీఆర్ ను హెచ్చరించారు.

Maolas warning to Telangana CM KCR .. Change your attitude ..otherwise...

ఇక అంతే కాదు ఇటీవల మహబూబ్ నగర్ జిల్లాలో సీపీఐ మావోయిస్టు పార్టీ పేరిట వెలసిన పోస్టర్లలో సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ ఖబడ్దార్ సీఎం కేసీఆర్.. దిక్కుమొక్కులేని జనం ఒక్కొక్కరు అగ్నికణం మహేంద్ర కర్మ కు పట్టిన గతే నీకు పడుతుంది అంటూ ఉరికొయ్యలు చెరసాలలు విప్లవాన్ని ఆపలేవు అంటూ ఆ ఆ పోస్టర్లలో పేర్కొన్నారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టులు కెసిఆర్ కి తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తూ ఉనికిని చాటుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పలు సందర్భాలలో మావోయిస్టుల లేఖలు వెలుగు చూసినప్పటికీ సీఎం కేసీఆర్ టార్గెట్ గా మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ పేరుతో వచ్చిన ఈ లేఖ మాత్రం ప్రస్తుతం తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు గ్రేహౌండ్స్ దళాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో కూంబింగ్ నిర్వహిస్తూ ఏజెన్సీ ప్రాంతాలను జల్లెడ పడుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+