కేంద్రమంత్రుల సమక్షంలో బీజేపీలో చేరిన మర్రి శశిధర్ రెడ్డి: టీఆర్ఎస్‌పై సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, సోనోవాల్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్, ఈటల రాజేందర్, డీకే అరుణ, వివేక్ వెంకటస్వామి సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు.
ఈ సందర్భంగా మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదన్నారు. తెలంగాణలో ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ విఫలమైందని ఆరోపించారు. మొత్తం ప్రపంచంలోనే టీఆర్ఎస్ అంత అవినీతి ప్రభుత్వం ఎక్కడా లేదని ఆరోపించారు. గత ఎనిమిదిన్నర ఏళ్లుగా ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఫెయిలైందని విమర్శించారు.

ప్రధాని మోడీ నాయకత్వంలో దేశం ముందుకు వెళుతోందని, తాను ఎంతో ఆలోచించాకే బీజేపీలో చేరానని మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పడం బీజేపీతోనే సాధ్యమవుతుందన్నారు. ఇలాంటి ఘట్టంలో భాగస్వామ్యం అవుతున్నందుకు తనకు సంతోషంగా ఉందన్నారు. బీజేపీ బలోపేతానికి కృషి చేస్తానని, రాష్ట్రంలో బీజేపీ సర్కారు ఏర్పాటుకు ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధమేనని శశిధర్ రెడ్డి వ్యాఖ్యానించారు.
Delhi | M Shashidhar Reddy, the four-time MLA from Sanathnagar, Telangana who recently resigned from Congress, joins BJP in the presence of Union ministers G Kishan Reddy and Sarbananda Sonowal and Telangana BJP president Bandi Sanjay Kumar pic.twitter.com/0zzzH14Mcw
— ANI (@ANI) November 25, 2022
కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తూ.. ఆ పార్టీకి క్యాన్సర్ సోకిందని, అది నయం చేయలేని పరిస్థితికి చేరిందని ఇటీవలో విమర్శలు గుప్పించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యవహారం సరిగ్గా లేదని అన్నారు. ఆయన తీరువల్లే కాంగ్రెస్ పార్టీని చాలా మంది నేతలు వీడుతున్నారని శశిధర్ రెడ్డి ఆరోపించారు. రేవంత్ వైఖరి వల్ల తెలంగాణలో కాంగ్రెస్ ఉనికిని కోల్పోతుందన్నారు.












Click it and Unblock the Notifications