ప్రేమ వివాహం: ఉరేసుకుని ఆత్మహత్య (ఫోటోలు)
హైదరాబాద్: నగరంలో ఓ గృహిణి అనుమానాస్పద స్ధితిలో మృతి చెందింది. ఈ సంఘటన ఆల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా బోధన్ ప్రాంతానికి చెందిన లాస్యప్రియ(26) ఓల్డ్ అల్వాల్ పంచశీల కాలనీకి చెందిన అభిషేక్(27)లు ఈ ఏడాది ఫిబ్రవరి 27న పెద్దల అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకున్నారు.

పెళ్లి తర్వాత పంచీల కాలనీలోనే వీరు నివాసం ఉంటున్నారు. రెండు రోజుల క్రితం సోదరుడి వివాహం కోసం నిజామాబాద్‌కు వెళ్లిన లాస్య మంగళవారం సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చింది. బుధవారం ఉదయం అభిషేక్ లేచి చూసే సరికే బెడ్ రూమ్‌లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. దీంతో లాస్య మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతురాలి శరీరంపై గాయాలు కనిపిస్తుండటంతో పాటు, పై పెదవి కింద పన్ను విరిగిపోయి ఉంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

విషయం తెలుసుకున్న మృతురాలి తల్లి దండ్రులు ఘటన స్థలానికి చేరుకుని, లాస్యది ఆత్మహత్య కాదని, భర్తే హత్య చేసి ఆత్మే హత్యగా చిత్రీకరిస్తున్నాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అభిషేక్‌పై హత్యా నేరం కింద కేసు నమోదు చేసి, కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్‌చేస్తూ అభిషేక్ ఇంటివద్దనే బైఠాయించారు.












Click it and Unblock the Notifications