ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య బోర్ కొట్టింది: రెండో పెళ్లికి సిద్ధపడిన టెక్కీ
హైదరాబాద్: పెళ్లి పేరుతో ఓ సాప్ట్‌వేర్ ఇంజనీర్ ఘరానా మోసానికి పాల్పడ్డాడు. వరంగల్ జిల్లా హన్మకొండకు చెందిన రాజ్ కుమార్ అనే యువకుడు హైదరాబాదులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు.
తాను ఉద్యోగంలో చేరడానికి ముందే ఈ కుర్రాడు హన్మకొండలో ఓ కానిస్టేబుల్ కుమార్తెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే భార్య బోర్ కొట్టిందని, రాజ్ కుమార్ పెళ్లైన విషయం దాచి, మరోయువతితో వివాహం కుదుర్చుకున్నాడు.

ఈ నెల 18న వివాహం తేదీ కూడా నిశ్చయించారు. యువతి కుటుంబ సభ్యులు బంధువులకు కార్డులు పంచేందుకు హన్మకొండ చేరుకున్నారు. ఇదే సమయంలో రాజ్ కుమార్ పెళ్లైన విషయాన్ని అమ్మాయి తల్లిదండ్రులు తెలుసుకున్నారు.
చాకచక్యంగా వ్యవహరించి రాజ్ కుమార్‌ను అమ్మాయి తల్లిదండ్రులు హన్మకొండ పోలీసులకు పట్టించారు.












Click it and Unblock the Notifications