తెలంగాణా బీజేపీలో ప్రక్షాళన మొదలైంది!!

తెలంగాణ రాష్ట్రంలో గత ఎన్నికలలో సత్తా చాటాలని, బిజెపి జెండా ఎగురవేయాలని భావించి ప్రయత్నం చేసిన బీజేపీకి భంగపాటు తప్పలేదు. బిజెపి చేసిన స్వయంకృత అపరాధాలే ఓటమికి కారణమని తర్వాత పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది. చాలా జిల్లాలలో అధ్యక్షులు సరిగా పనిచేయకపోవడం, క్షేత్రస్థాయిలోకి పార్టీగుర్తు వెళ్లకపోవడం, బండి సంజయ్ ను మార్చి కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించడం వంటి అనేకఅంశాలు బిజెపి ఓటమికి ప్రధాన కారణాలుగా మారాయి.

ఇక అసెంబ్లీ ఎన్నికల అధ్యాయం ముగిసిన తర్వాత, లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో బిజెపి రూటు మార్చింది. తెలంగాణ బిజెపి భారీ ప్రక్షాళన మొదలుపెట్టింది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర మోర్చా లతో పాటు 12 మంది జిల్లాల అధ్యక్షులను ఒక్కసారిగా మార్చేసింది బిజెపీ. మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మినహా మిగిలిన ఆరు మోర్చా లను మార్పు చేశారు.

massive changes started in Telangana BJP!!

ఇప్పుడు మార్చిన వాళ్లంతా చాలాకాలంగా పదవుల్లో ఉన్నవాళ్లే కావడంతో ఈ మార్పు చేసినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం బిజెపి ఎస్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కళ్యాణ్ నాయక్ ను, ఎస్సీ మోర్చా కు కొండేటి శ్రీధర్ ను , యువ మొర్చాకు సేవెల్ల మహేందర్, ఓబీసీ మొర్చాకు ఆనంద్ గౌడ్, మహిళా మొర్చాకు డాక్టర్ శిల్పను నియమించారు.

అంతేకాదు జిల్లాల అధ్యక్షులను మార్చిన బీజేపీ పెద్దపల్లికి చందుపట్ల సునీల్, నిజామాబాద్ కు కులాచారి దినేష్ కుమార్, సంగారెడ్డికి గోదావరి , సిద్ధిపేటకు గంగడి మోహన్ రెడ్డి, భువనగిరి కి పాశం భాస్కర్, నల్లగొండకు డా. వర్షిత్ రెడ్డి, ములుగుకు బలరాం, మహబూబ్నగర్ కు పీ. శ్రీనివాస్ రెడ్డి, వరంగల్ కు గంటా రవి కుమార్, నారాయణ పేట్ కు జలంధర్ రెడ్డి, వికారాబాద్ కు మాధవ్ రెడ్డి, వనపర్తికి డీ. నారాయణ లను నియమించారు.

అయితే ఈ జిల్లాలలో కొత్తవారికి అవకాశం ఇవ్వటం వలన రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధుల గెలుపుకు కష్టపడి పనిచేస్తారని భావిస్తున్నారు. మొత్తంగా చూస్తే బీజేపీ లోక్ సభ ఎన్నికల కోసం అనేక జిల్లాలలో అధ్యక్షుల మార్పుతో కొత్త టీం ను సిద్ధం చేసుకుంది.భారీ ప్రక్షాళన చేపట్టింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+