కాకతీయ మెడికల్ కాలేజీలో ఉరేసుకుని మెడికో ఆత్మహత్య
వరంగల్: వరంగల్‌లోని కాకతీయ వైద్య కళాశాలలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఎంబిబిఎస్ ఫైనలియర్ చదువుతున్న మౌనిక అనే విద్యార్థిని హాస్టల్ గదిలో మంగళవారంనాడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
మౌనిక స్వస్థలం హైదరాబాద్, ఆమె మృతికి గల కారణాలు తెలియ రావడం లేదు. సంఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. కేవలం చదువుకు సంబంధించిన ఒత్డిడి వల్లనే ఆత్మహత్య చేసుకుందా, మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

దాదాపుగా మెడిసిన్ పూర్తి కావస్తున్న సమయంలో ఇలా మౌనిక బలవన్మరణానికి పాల్పడడం పట్ల ఆవేదన వ్యక్తమవుతోంది. తోటి విద్యార్థులు, అధ్యాపకులు తీవ్ర విచారంలో మునిగిపోయారు.












Click it and Unblock the Notifications