తెలంగాణకు భారీ పెట్టుబడులు: 3వేల కోట్లతో మెడ్‌ట్రానిక్ ఆర్అండ్‌డీ సెంటర్, ఆక్యుజెన్ కూడా

హైదరాబాద్: తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ సంస్థలు ముందుకు వచ్చాయి. తెలంగాణకు పెట్టుబడులు తెచ్చేందుకు తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అమెరికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ, మెడ్ ట్రానిక్ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. ఈ నేపథ్యంలోనే లైఫ్ సైన్సెస్ రంగంలో కీలక మార్పులు తీసుకురావడానికి ఆక్యుజెన్ సంస్థతో పెట్టుబడుల ఒప్పందం కుదుర్చుకున్నారు.

 Medtronic to invest 3000cr to expand its R & D center in Hyderabad

లైఫ్ సైన్సెస్ రంగాన్ని 250 బిలియన్ డాలర్లకు పెంచాలనే లక్ష్యంతో ఆక్యుజెన్ సంస్థతో మంత్రి కేటీఆర్ సమావేశాలు జరిపారు. అనంతరం ఆక్యుజెన్ సంస్థ హైదరాబాద్‌లో పరిశోధన కేంద్రాన్నిఏర్పాటు చేయనున్నట్లు కేటీఆర్‌తో సమావేశంలో ఆక్యుజెన్ ప్రతినిధులు ప్రకటించారు.

ఆక్యుజెన్ సంస్థ నిర్ణయంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సంస్థ లైఫ్ సైన్సెస్ రంగంలో కీలకంగా మారుతుందన్నారు. జీన్‌, సెల్‌థెరపీకి సంబంధించి హైదరాబాద్‌లో అభివృద్ధి, పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటుచేయనున్నట్లు ఆక్యుజెన్‌ పేర్కొంది.

జీన్ ‌థెరపీ కోసం కావల్సిన అధునిక సౌకర్యాలు అంతర్జాతీయ ప్రమాణాలతో, వైద్యరంగంలో పూర్తిసాంకేతికతతో కేంద్రాన్ని ఏర్పాటుచేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు మంత్రి కేటీఆర్ న్యూయార్క్‌ పర్యటనలో భాగంగా ఆక్యుజెన్‌ సహవ్యవస్థాపకుడు డాక్టర్‌ శంకర్‌ముసునూరి ఛీఫ్‌ సైంటిఫిక్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ అరుణ్‌ ఇపాధ్యాయలతో భేటీ అయ్యారు.

పరిశోధనా, అభివృధ్ది కేంద్రానికి సంబంధించిన అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. తెలంగాణ ప్రభుత్వంతో సహకరిస్తున్నందుకు ఆనందంగా ఉందని సంస్థ సీఈఓ శంకర్‌ముసునూరి తెలిపారు. 2030 నాటికి 2 వందల 50 బిలియన్ డాలర్ల ఎకో సిస్టెమ్‌గా మారడమే తమ లక్ష్యమని తెలిపింది.

3వేల కోట్ల పెట్టుబడులతో ముందుకొచ్చిన మెడ్‌ట్రానిక్స్

వైద్య పరికరాల ఉత్పత్తి, హెల్త్ కేర్ రంగంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెడ్‌ట్రానిక్స్‌ సంస్థ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. 3 వేల కోట్ల రూపాయలతో హైదరాబాద్‌లో మెడికల్‌ డివైజెస్‌ ఆర్‌ అండ్‌ డీ సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. అమెరికా పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో ఆ కంపెనీ ప్రతినిధులు సమావేశమయ్యారు. తమ విస్తరణ ప్రణాళికల గురించి తెలిపారు.

లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ రంగంలో హైదరాబాద్‌ను గ్లోబల్ లీడర్‌గా మార్చే తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నంలో భాగస్వాములమవుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు మెడ్‌ట్రానిక్ సర్జికల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అండ్ ప్రెసిడెంట్ మైక్ మరీనా. మానవ జీవితాలను మార్చే టెక్నాలజీ ఆవిష్కరణలకు భారతదేశం నయా గమ్యస్థానంగా మారిందన్నారు.

లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ రంగంలో హైదరాబాద్ ప్రాధాన్యతను గుర్తించాకే తాము ఈ పెట్టుబడి ప్రకటన చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నందకు గర్వంగా ఉందని మైక్ మరీనా చెప్పారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. వైద్య పరికరాల ఉత్పత్తికి భారతదేశంలో అపారమైన మార్కెట్ ఉందని గుర్తించిన తొలి రాష్ట్రం తెలంగాణ అన్నారు. లైఫ్ సైన్సెస్ రంగంలో తమ పోటీ ప్రపంచంతోనే అన్నారు. లైఫ్ సైన్సెస్,హెల్త్ కేర్ రంగంలో హైదరాబాద్ కు ఉన్న పట్టుకు, పెరుగుతున్న ప్రాధాన్యతకు మెడ్‌ట్రానిక్ తాజా పెట్టుబడే నిదర్శనమని తెలిపారు.

కాగా, మెడ్‌ట్రానిక్‌ సంస్థకు ఐర్లాండ్‌లోని డబ్లిన్‌లో ప్రధాన కార్యాలయం ఉంది. 150 కంటే ఎక్కువ దేశాలలో కార్యకలాపాలు చేస్తోంది. 90 వేలకు పైగా ఉద్యోగులు ఈ సంస్థలో పనిచేస్తున్నారు. కార్డియాక్ పరికరాలు, సర్జికల్ రోబోటిక్స్, ఇన్సులిన్ , సర్జికల్ టూల్స్, పేషెంట్ మానిటరింగ్ సిస్టమ్‌ వంటి 70 రకాల ఆరోగ్య సమస్యల చికిత్సలో ఉపయోగించే పరికరాల ఆవిష్కరణలు చేసిందీ సంస్థ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+