Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Sai Dharam Tej : మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌కు రోడ్డు ప్రమాదం-తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో

మెగా హీరో సాయిధరమ్ తేజ్‌ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. స్పోర్ట్స్ బైక్ డ్రైవ్ చేస్తూ సాయిధరమ్ తేజ్ కింద పడిపోయారు. ప్రమాదంలో తీవ్ర గాయాలవడంతో ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్ రోడ్ నం.45 కేబుల్ బ్రిడ్జి మార్గంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే సాయిధరమ్ తేజ్‌ను స్థానికులు మెడికవర్ ఆస్పత్రికి చేర్చారు. ప్రమాదంలో సాయిధరమ్ తేజ్ కుడి కన్ను,ఛాతి,పొట్ట భాగంలో గాయాలైనట్లు చెబుతున్నారు. ప్రస్తుతం మెడికవర్ ఆస్పత్రిలో ఆయనకు సీటీ స్కాన్ ఇతర వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.

అతివేగమే ప్రమాదానికి కారణమని మాదాపూర్ సీఐ తెలిపారు.గచ్చిబౌలి వైపు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ప్రమాదంపై సాయి ధరమ్ తేజ్‌ కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు చెప్పారు.ప్రమాద తీరును సీసీటీవీ ఫుటేజీలో పోలీసులు పరిశీలిస్తున్నారు.

mega hero sai dharam tej injured after fell down from sports bike

అతివేగమే ప్రమాదానికి కారణమని మాదాపూర్ సీఐ తెలిపారు.గచ్చిబౌలి వైపు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు చెప్పారు. ప్రమాదంపై సాయి ధరమ్ తేజ్‌ కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు చెప్పారు.ప్రమాద తీరును సీసీటీవీ ఫుటేజీలో పోలీసులు పరిశీలిస్తున్నారు.

మెరుగైన చికిత్స కోసం అపోలో ఆస్పత్రికి తరలింపు :

ప్రమాదం తర్వాత సాయి ధరమ్ తేజ్‌ను మెడికవర్ ఆస్పత్రికి తరలించగా... అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంతో షాక్‌లోకి వెళ్లిన సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం స్పృహలోకి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రాణాపాయం ఏమీ లేదని ఆస్పత్రి వర్గాలు వెల్లడించినట్లు సమాచారం.అంతకుముందు,జనసేన అధినేత,సాయి ధరమ్ తేజ్ మేనమామ పవన్ కల్యాణ్ మెడికవర్ ఆస్పత్రికి వెళ్లి సాయి ధరమ్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.

ఓవర్ స్పీడ్ కారణంగానే ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. అయితే ప్రమాద సమయంలో సాయి ధరమ్ తేజ్ హెల్మెట్ పెట్టుకుని ఉండటంతో పెద్ద ముప్పే తప్పిందంటున్నారు. సాయి ధరమ్ తేజ్ నడిపిన స్పోర్ట్స్ బైక్‌పై ఆగస్టు 2న ఓవర్ స్పీడ్ కారణంగా చలానా నమోదైనట్లు తెలుస్తోంది. ఇప్పటికీ అది పెండింగ్‌లోనే ఉన్నట్లు సమాచారం.

Recommended Video

    Shikhar Dhawan సింగిల్.. ఇంతకీ ఎవరీ Ayesha Mukherjee | గబ్బర్ కంటే పదేళ్లు పెద్ద || Oneindia Telugu

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+