హ్యాపీ బర్త్ డే గురూజీ .. అమితాబ్ బచ్చన్ కు విషెస్ చెప్పిన మెగాస్టార్ చిరంజీవి!!
బాలీవుడ్ స్టార్, బిగ్ బి అమితాబ్ బచ్చన్ పుట్టినరోజు ఈరోజు. అమితాబ్ బచ్చన్ 81 వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ రోజున బాలీవుడ్ వ్యాప్తంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువగా మారాయి. సినిమా సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు అమితాబ్ బచ్చన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
అమితాబ్ బచ్చన్ పుట్టినరోజు సందర్భంగా బాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఆయనకు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఎక్స్ లో చిరంజీవి ట్వీట్ చేశారు. తాను చేసిన ట్వీట్లో సైరా నరసింహారెడ్డి చిత్రంలోని ఫోటోలను పంచుకున్న చిరంజీవి గురూజీ మీకు 81వ జన్మదిన శుభాకాంక్షలు అంటూ తన ట్వీట్ ను కొనసాగించారు.

మీరు సంతోషం మరియు మంచి ఆరోగ్యంతో నిండిన దీర్ఘాయువుతో ఆశీర్వదించ బడాలని తను కోరుకుంటున్నానని మెగాస్టార్ చిరంజీవి తన ట్వీట్ లో వెల్లడించారు. మీ నటనా , ప్రతిభా పాటవాలతో, అనేక సంవత్సరాల పాటు మీరు లక్షలాది మందిని ఆకట్టుకుని, ఎంతోమందికి స్ఫూర్తినిస్తూ ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ మీ పుట్టినరోజు కూడా నాకు చాలా ప్రత్యేకమైనది అని పేర్కొన్న చిరంజీవి ఎందుకంటే మీ కౌన్ బనేగా కరోడ్ పతి KBC షోలో ఈ రాత్రి వర్చువల్‌గా నా ఆరాధ్యదైవమైన మిమ్మల్ని కలవాలని నేను ఎదురు చూస్తున్నాను అంటూ తన ట్వీట్లో పేర్కొన్నారు. ఇక సోషల్ మీడియా వేదికగా బాలీవుడ్ లెజెండ్ అమితాబచ్చన్ కు అభిమానుల నుండి శుభాకాంక్షలు వెల్లువగా మారుతున్నాయి.
A Very HAPPY 81st BIRTHDAY 🙏
— Chiranjeevi Konidela (@KChiruTweets) October 11, 2023
Guru Ji @SrBachchan ! 💐💐
May you be blessed with a long life, filled with happiness & good health!
May you keep enthralling & inspiring millions of us for many many years to come, with your acting genius!! 🙏🙏
This Birthday of yours is also… pic.twitter.com/bLQY3OjwkU
మరోవైపు అమితాబ్ బచ్చన్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులు ఆయన ఇంటివద్దకు చేరుకొని హంగామా చేశారు. అమితాబ్ బచ్చన్ వారికి అభివాదం చేశారు. అమితాబ్ బచ్చన్ 81వ పుట్టినరోజు సందర్భంగా తన నివాసం వెలుపల తన అభిమానులను కలుసుకొని వారందరికీ స్పెషల్ ట్రీట్ ఇచ్చారు. అమితాబ్ బచ్చన్ ప్రతి ఆదివారం మాత్రమే తన అభిమానులను కలుసుకుంటూ ఉంటారు.
ఆ సంప్రదాయానికి భిన్నంగా ఈసారి తన పుట్టినరోజు సందర్భంగా అమితాబ్ బచ్చన్ నిన్న అర్ధరాత్రి అభిమానులకు ప్రత్యేక ట్రీట్ ఇచ్చారు. అమితాబ్ బచ్చన్ తో పాటు ఐశ్వర్యారాయ్ బచ్చన్, మనవరాలు నవ్య నవేలి మరియు ఆరాధ్య కూడా అమితాబ్ బచ్చన్ తన అభిమానులతో కలిసే మధురమైన క్షణాలను ఫోటోలు, వీడియోలు తీశారు.
-
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications