యువకుడి ప్రాణం కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్‌కు మెగాస్టార్ చిరంజీవి సెల్యూట్.. ఫ్రెండ్లీ పోలీసింగ్ ఇదే!!
యువకుడి ప్రాణం కాపాడిన కానిస్టేబుల్ కు మెగాస్టార్ చిరంజీవి సెల్యూట్ చేస్తున్నానని ట్వీట్ చేశారు.
రోడ్డుపై కుప్పకూలి పడిపోయిన ఒక యువకుడి ప్రాణాలను ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజశేఖర్ సిపిఆర్ అందించి కాపాడిన తీరు పై ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తుంది. ఇక మెగాస్టార్ చిరంజీవి సైతం రాజశేఖర్ చేసిన పనికి ఫిదా అయ్యారు. రాజశేఖర్ ను కొనియాడారు.
యువకుడి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్.. వీడియో వైరల్
సైబరాబాద్ పరిధిలో రాజేంద్రనగర్ లో పనిచేస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజశేఖర్ తన వృత్తి ధర్మంతో పాటుగా రోడ్డుపై ఓ యువకుడు కుప్పకూలిపోవడంతో, వెంటనే అతని వద్దకు వెళ్లి కార్డియాక్ అరెస్ట్ అయిందని గుర్తించి సిపిఆర్ చేసి అతని ప్రాణాలు కాపాడి ఆసుపత్రికి తరలించారు. ఎల్బీనగర్ నుండి ఆరం ఘర్ వైపు వెళుతున్న బస్సులో ప్రయాణం చేస్తున్న బాలాజీ అనే వ్యక్తి ఆరంఘర్ చౌరస్తాలో బస్సు దిగారు.
బస్సు దిగడంతోనే అతను గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజశేఖర్ వెంటనే అతని వద్దకు వెళ్లి, అతని పరిస్థితి గమనించి ఛాతీపై బలంగా ప్రెస్ చేసి సిపిఆర్ చేసి అతడిని కాపాడారు. ఈ క్రమంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రాణాలు కాపాడిన రాజశేఖర్ కు సెల్యూట్ అంటూ ట్వీట్ చేసిన చిరంజీవి
నెటిజన్ లతో పాటు, పోలీస్ ఉన్నతాధికారులు సైతం రాజశేఖర్ ని ప్రశంసించగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి రాజశేఖర్ పై ప్రశంసల జల్లు కురిపించారు. ట్విట్టర్ వేదికగా ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజశేఖర్ ను అభినందించిన మెగాస్టార్ చిరంజీవి ఫ్రెండ్లీ పోలీస్ కు ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజశేఖర్ ఒక ఉదాహరణ అంటూ కితాబు ఇచ్చారు. ఈరోజు చురుకుగా వ్యవహరించి సమయానికి సిపిఆర్ అందించి ఒక ప్రాణాన్ని కాపాడిన సైబరాబాద్ పోలీస్ కానిస్టేబుల్ రాజశేఖర్ కు నాకు సెల్యూట్ అని చిరంజీవి పేర్కొన్నారు.

మానవత్వం లోను, రక్షించడంలోనూ ఫ్రెండ్లీ పోలీసింగ్ కు ఉదాహరణ
రాజశేఖర్ గారు మీరు కర్తవ్యాన్ని మించి సాటి మనిషిని కాపాడారు. మానవత్వం లోను, రక్షించడంలోనూ ఫ్రెండ్లీ పోలీసింగ్ కు ఉదాహరణగా నిలిచారు. అంటూ మెగాస్టార్ చిరంజీవి తన ట్వీట్ లో పేర్కొన్నారు. గతంలో కూడా చిరంజీవి లాక్ డౌన్ సమయంలో లేడీస్ సబ్ ఇన్స్పెక్టర్ శుభశ్రీ నాయక్ చూపిన చొరవను ప్రశంసించారు .ఆమెతో వీడియో కాన్ఫరెన్స్ లో కూడా మాట్లాడి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు చిరంజీవి. ఇప్పుడు మరో మారు ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజశేఖర్ కు సెల్యూట్ చేస్తూ ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టారు.

శభాష్ రాజశేఖర్.. నెట్టింట ప్రశంసలు
ఇక మెగాస్టార్ చిరంజీవి పెట్టిన ట్వీట్ తో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా మంచి విషయాన్ని కానీ, మంచి చేసే వారిని అభినందించడంలో మెగాస్టార్ ఎప్పుడు ముందు ఉంటాడని ఆయన అభిమానులు చెబుతున్నారు. రాజశేఖర్ కు మేము కూడా సెల్యూట్ చేస్తున్నామంటూ మెగా అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో రాజశేఖర్ యువకుడిని కాపాడిన వీడియోతో పాటు, ఆయనను అభినందిస్తూ చిరంజీవి చేసిన ట్వీట్ కూడా వైరల్ అవుతుంది. ఇక రాజశేఖర్ ను ప్రతి ఒక్కరు శభాష్ రాజశేఖర్ అంటూ సోషల్ మీడియాలో తెగ పొగిడేస్తున్నారు.












Click it and Unblock the Notifications