హైదరాబాద్ కు మెస్సీ ఫీవర్.. మెస్సీతో ఫోటో ఇంత కాస్ట్​లీ నా!

ఫుట్ బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ హైదరాబాద్ పర్యటన అభిమానుల్లో మెస్సి ఫీవర్ కు కారణంగా మారింది. మెస్సి అభిమానులు ఆయన రాకతో ఉత్సాహంలో కేరింతలు కొడుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మెస్సి మ్యాచ్ చూడడానికి ఉప్పల్ స్టేడియంలో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు కోల్కత్త నుంచి హైదరాబాద్ కు చేరుకున్నారు మెస్సి.

హైదరాబాద్ లో మెస్సి మేనియా
అక్కడినుండి చారిత్రక ఫలక్నుమా ప్యాలెస్ కి వెళ్లి, కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత వందమంది అభిమానులతో మీట్ అండ్ గ్రీట్ ఫోటో సెషన్ లో పాల్గొన్నారు. మెస్సీ రాకతో ఆ ప్రాంతాలకు భారీగా చేరుకున్న అభిమానులు ఒక్కసారి మెస్సీని చూసినా చాలు అన్నట్టు ఎదురు చూస్తున్నారు.ఈ ఫోటో సెషన్ కోసం అభిమానులు ఒక్కొక్కరు 10 లక్షల రూపాయల టిక్కెట్టు కొనుగోలు చేశారు.

Messi Mania Hits Hyderabad Rs 10 Lakh Ticket for a Photo Opportunity

ఉప్పల్ స్టేడియంలో మెస్సీ వర్సెస్ రేవంత్ రెడ్డి
ఆ తర్వాత ఉప్పల్ స్టేడియానికి బయలుదేరి ఉప్పల్ స్టేడియంలో మెస్సి ఫుట్ బాల్ లో రేవంత్ రెడ్డితో తలపడుతున్నారు. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో కలిసి 20 నిమిషాల పాటు ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడి ఫుట్ బాల్ లవర్స్ ను అలరిస్తారు. ఇది పూర్తిగా ప్రైవేటు కార్యక్రమం కావడంతో సింగరేణి ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేస్తుంది.

మెస్సి, రేవంత్ రెడ్డి మ్యాచ్ పై ఉత్కంఠ
రేవంత్ రెడ్డి సింగరేణి ఆర్ఆర్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తుండగా, మెస్సి అపర్ణ మెస్సి జట్టు తరఫున ఆడతారు. స్నేహితులు రోడ్రిగో, లూయిస్ సురేజ్ కూడా ఈ మ్యాచ్ లో పాల్గొంటారు. అయితే మ్యాచ్ చివరి ఐదు నిమిషాలు మాత్రమే ఉత్కంఠ భరితంగా ఉంటుంది. అప్పుడే మెస్సి, రేవంత్ రెడ్డి మైదానంలోకి దిగి ఆడతారు. అనంతరం విజేత జట్టుకు GOAT ట్రోఫీని ఇద్దరు కలిసి సంయుక్తంగా అందిస్తారు.

మెస్సీతో ఫోటో చాలా కాస్ట్లీ .. అదీ 100మంది అభిమానులకు మాత్రమే
ఏది ఏమైనా ప్రస్తుతం హైదరాబాద్లో మెస్సి మానియా కనిపిస్తుంది. మెసేజ్ తో ఫోటో దిగడం కోసం పది లక్షల రూపాయల టికెట్ ను కొనుగోలు చేశారంటే అతని క్రేజ్ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అది కూడా ఈ అవకాశం 100 మంది అభిమానులకు మాత్రమే ఇవ్వడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+