తెలంగాణాకు పోటెత్తిన ఇతర రాష్ట్రాల కూలీలు.. కారణం ఇదే!

ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా పత్తి సేకరణ పనులు జోరుగా సాగుతున్నాయి. ఇదే సమయంలో వరి కోతలు కూడా ఒకేసారి చేతికందడంతో రైతన్నలకు తీవ్రమైన కూలీల కొరత వెంటాడుతోంది. కుటుంబ సభ్యులతో కలిసి కష్టపడినా సరిపోకపోవడంతో అన్నదాతలు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వలస కూలీలపై ఆధారపడుతున్నారు. ముఖ్యంగా కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్ ప్రాంతంలో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది.

ఉపాధి కరవైన పంజాబ్, హర్యానా, రాజస్థాన్ తదితర రాష్ట్రాల నుంచి చిన్న పిల్లలతో సహా వలస కూలీలు పెద్ద సంఖ్యలో కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటున్నారు. స్టేషన్ పరిసరాలు, పోస్టాఫీసు ప్రాంతాల్లో గుడారాలు వేసుకొని అక్కడే తలదాచుకుంటున్నారు. దళారులు లేదా రైతులు నేరుగా అక్కడికి వచ్చి కూలీలతో మాట్లాడుకుని తమ పొలాలకు తరలించుకు పోతున్నారు.

Migrant Laborers From Punjab and Haryana Arrive in Telangana for Cotton Picking in this season

రాబోయే రెండు మూడు నెలల పాటు వీరంతా తెలంగాణా రాష్ట్రంలో కూలి పనులలో నిమగ్నం కానున్నారు. తెలంగాణాలో రాబోయే రెండు మూడు నెలలు పత్తి దిగుబడి అధికంగా ఉండనుండటంతో వీరికి తిండికి, పనికి ఎలాంటి లోటు ఉండదని చెప్పవచ్చు. ఈ సీజన్‌లో పత్తి ఏరే కూలీలకు రైతులు కిలో పత్తికి రూ.10 నుంచి రూ.12 వరకు చెల్లిస్తున్నారు. అంతేకాకుండా రవాణా ఖర్చులు పూర్తిగా రైతన్నలే భరిస్తున్నారు.

కూలీల సంఖ్యను బట్టి ప్రతిరోజూ పాలు, తాగునీరు, చక్కెర అందించడంతో పాటు, వారానికి ఒకసారి తప్పనిసరిగా చికెన్ తెచ్చివ్వాలనే సరికొత్త నిబంధనలను కూలీలు పెడుతున్నారు. రైతులు కూలీల డిమాండ్ లకు ఒప్పుకుని వారికి కావాల్సిన సదుపాయాలను సైతం కల్పిస్తున్నారు. పత్తి ఏరడం, దాన్ని ట్రాక్టర్లలో ఎక్కించడం, సేకరించిన పత్తిని నిల్వ చేయడం తదితర పనుల కోసం తెలంగాణా రైతులు ఈ కూలీలతో ఒప్పందం చేసుకుంటున్నారు.

చర్లపల్లి కేంద్ర కారాగారంలో ప్రభుత్వ ఐటీఐ ప్రారంభం.. ఖైదీల జీవితంలో కొత్త అధ్యాయం!
చర్లపల్లి కేంద్ర కారాగారంలో ప్రభుత్వ ఐటీఐ ప్రారంభం.. ఖైదీల జీవితంలో కొత్త అధ్యాయం!

సుమారు 3 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి వచ్చిన వీరు, రాబోయే మూడు నెలల్లో ఒక్కొక్కరు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు సంపాదించుకునే అవకాశం ఉందని చెప్తున్నారు.తమకు స్థానికంగా ఉపాధి లేకనే తాము పిల్లాపాపలతో సహా తెలంగాణాకు పని కోసం వలస వచ్చామని కూలీలు చెబుతున్నారు. మూడు నెలల పాటు కుటుంబం మొత్తానికి పని దొరుకుతుందని, అందుకే 3 వేల కిలోమీటర్లు పొట్ట చేతపట్టుకొని వచ్చామని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+