Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ముగ్గులేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు; తీన్మార్ స్టెప్పులతో ఇర‌గ‌దీసిన మంత్రి మ‌ల్లారెడ్డి!!

ఒక పక్క తెలంగాణ రాష్ట్రంలో మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో హాట్ హాట్ పాలిటిక్స్ కొనసాగుతూ ఉంటే మరో పక్క తెలంగాణ మంత్రులు జోష్ తో ఊగిపోతున్నారు. రెండు వేర్వేరు సందర్భాలలో తెలంగాణా మంత్రులు సందడి చేశారు. తాజాగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణలో ముగ్గులు వేసి అందరినీ ఆశ్చర్య పరిస్తే, ఇక తెలంగాణ కార్మిక మంత్రి చామకూర మల్లారెడ్డి సీఎం కేసీఆర్ బహిరంగ సభకు వెళుతున్న కాన్వాయ్ లో కారు రూఫ్ పైన సరదాగా తీన్మార్ స్టెప్పులేశారు.

ముగ్గులేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

ముగ్గులేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

ఇక వివరాల్లోకి వెళితే స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవ వేడుకలు తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 22వ తేదీ వరకు కొనసాగనున్న నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఈరోజు వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీలకు ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మహిళలతో కలిసి ముగ్గులు వేసి అందరినీ ఆశ్చర్య పరిచారు. ముగ్గు వేయడంతో పాటుగా ముగ్గులో రంగులు దిద్దుతూ, మహిళలను ఉత్సాహపరిచారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.

మంత్రి ముగ్గులేస్తుంటే ఛలోక్తులు విసిరిన ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, నరేందర్


ఇక ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ ప్రావీణ్య, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ తదితరులు పాల్గొన్నారు. ముగ్గుల పోటీకి అతిథిగా వెళ్లిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చక్కగా మహిళలతో పాటు కింద కూర్చొని రంగవల్లులు దిద్దడం పై జిల్లా ప్రజలు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. ఇక మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముగ్గులు వేస్తుంటే పక్కనే ఉన్న ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఆయనను ఎంకరేజ్ చేస్తూ, ఛలోక్తులు విసిరారు. ఈ సరదా సన్నివేశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

టీఆర్ఎస్ ర్యాలీలో మంత్రి మల్లారెడ్డి హంగామా

టీఆర్ఎస్ ర్యాలీలో మంత్రి మల్లారెడ్డి హంగామా


ఇదిలా ఉంటే తెలంగాణ కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి కూడా మునుగోడు ఉప ఎన్నిక త్వరలో జరగనున్న నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రజా దీవెన సభ పేరిట భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న క్రమంలో రెండు వేల కార్లతో ర్యాలీ గా వెళ్ళిన టిఆర్ఎస్ ర్యాలీలో పాల్గొన్నారు. కుర్రాళ్ళను సైతం పక్కన పెట్టే జోష్ తో ఉండే మల్లారెడ్డి ఈ ర్యాలీలో కూడా ఆయన హంగామా చేశారు. కారు రూఫ్ టాప్ లో నిలబడి పాటలకు స్టెప్పులేస్తూ మల్లారెడ్డి అదరగొట్టారు.

మంత్రి మల్లన్న తీన్మార్ స్టెప్పులు .. సోషల్ మీడియాలో వైరల్


ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆయన వీడియో వైరల్ గా మారింది. మంత్రి మల్లన్న తీన్మార్ స్టెప్పులు వేస్తూ కుర్రాడి లాగ డ్యాన్సులు చెయ్యటం పార్టీ శ్రేణుల్లోనూ ఉత్సాహం నింపింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతుంది. ఈ వయసులోనూ ఆయన జోష్ ప్రతి ఒక్కరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక మంత్రి మల్లారెడ్డి వీడియో చూసినవాళ్లంతా, మల్లారెడ్డినా మజాకానా అంటున్నారు. ఎప్పుడైనా ఆయన స్టైలే వేరని తెగ చెప్పుకుంటున్నారు. సరదాగా ఆయన చేసిన డాన్స్ కు చాలామంది ఫిదా అవుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+