పన్ను వసూళ్లలో స్పెషల్ డ్రైవ్: 3 నెలలు, మూడు వేల కోట్లు (ఫోటోలు)
హైదరాబాద్: చాలాకాలం నుంచి వసూళ్లకు నోచుకోక పెండింగ్‌లో ఉన్న వేల కోట్ల పన్ను బకాయిలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. వీటి వసూళ్ల కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం సచివాలయంలో ఆర్థికశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ర్టానికి ప్రధాన ఆదాయాన్ని తీసుకువచ్చే కమర్షియల్ ట్యాక్స్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, ఎక్సైజ్, రోడ్లు భవనాలశాఖ, అటవీ, పరిశ్రమల శాఖ, రెవెన్యూ, మైనింగ్‌శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు.

పన్ను వసూళ్లలో స్పెషల్ డ్రైవ్: 3 నెలలు, మూడు వేల కోట్లు
అలాగే బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా తెలంగాణలో ప్రతి సెంటుభూమికి నీరు అందించాలని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిందని, చెరువులకు పూర్వవైభవం తేవడానికి మిషన్ కాకతీయ, ప్రతిఇంటికి నల్లానీటిని అందించడానికి వాటర్‌గ్రిడ్ కార్యక్రమాలను రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చేపట్టారని అన్నారు.

పన్ను వసూళ్లలో స్పెషల్ డ్రైవ్: 3 నెలలు, మూడు వేల కోట్లు
ఈ కార్యక్రమాలకు సరిపడా నిధులను అందించాల్సిన బాధ్యత ఆర్థికశాఖపై ఉందన్నారు. పన్నుల రాబడి పెంచాలని, బకాయిలు వసూలు చేయాలని మంత్రి ఈటల చేసిన సూచనపై అధికారులు స్పందించారు. రూ 5వేల కోట్ల వాణిజ్యపన్ను బకాయిల్లో దాదాపు రూ.3 వేలకోట్లను వసూలు చేయగలుగుతామని అధికారులు మంత్రికి వివరించారు.
పన్ను వసూళ్లలో స్పెషల్ డ్రైవ్: 3 నెలలు, మూడు వేల కోట్లు
ఆదాయం పెరుగడంపై సమావేశంలో హర్షం వ్యక్తంచేసిన మంత్రి ఈటల వచ్చే ఆర్థిక సంవత్సరం 2016-17 బడ్జెట్‌కు సిద్ధం కావాలని అన్నిశాఖలను ఆదేశించారు. అలాగే వాస్తవాల ఆధారంగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులకు సూచించారు.
పన్ను వసూళ్లలో స్పెషల్ డ్రైవ్: 3 నెలలు, మూడు వేల కోట్లు
పూర్తిగా పన్నుల ఆదాయం, ఖర్చుల ఆధారంగా తయారవుతున్న మొదటి బడ్జెట్ ఇదే అవుతుందని మంత్రి తెలిపారు. అమ్మకం పన్ను, వృతి పన్ను చెల్లించకుండా పక్కరాష్ర్టాలనుంచి సరఫరా అవుతున్న అక్రమమద్యంపై ప్రత్యేకదృష్టి సారించాలని మంత్రి అధికారులను కోరారు. మైనర్ మినరల్ లీజులను సులభతరం చేయాలని, పక్క రాష్ర్టాల నుంచి వస్తున్న ఇసుక రవాణాపై దృష్టి సారించాలని చెప్పారు.
పన్నుల రాబడి వేగం పెంచాలని ఆయన అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. ఆదాయం పెంపునకు ఏరకమైన పద్ధతులు అవలంబిస్తే బాగుంటుందో ఆలోచించాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా పన్నుల వసూళ్లలో వన్‌టైమ్ సెటిల్‌మెంట్ (ఓటీఎస్)ను ప్రవేశపెట్టడం ద్వారా బకాయి వసూళ్లు వేగవంతం చేయాలన్నారు.
ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు వివిధ శాఖల ద్వారా రూ.31 వేల కోట్ల పన్నులు వసూలయ్యాయని, అయితే ఒక్క కమర్షియల్ ట్యాక్స్‌లోనే రూ. 5 వేల కోట్లు బకాయిలున్నాయని, వాటిని వసూలు చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రభుత్వం పెద్దఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని వారికి వివరించారు.
ముఖ్యంగా రైతులకు రుణమాఫీ, పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల పథకం, నిరుపేద ఆడబిడ్డలకు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, సంక్షేమ హాస్టళ్లకు సన్నబియ్యం, పేదవిద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌లాంటి పథకాలను అమలు చేస్తుందని మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు.












Click it and Unblock the Notifications