వైఎస్ షర్మిలపై మంత్రి గంగుల కమలాకర్ ఘాటు వ్యాఖ్యలు

వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ తనదైన శైలిలో మండిపడ్డారు. వైయస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీపై, తెలంగాణ సీఎం కేసీఆర్ తీరుపై నిత్యం విమర్శలు గుప్పిస్తూ, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజా క్షేత్రంలో ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు.

అంతేకాదు బీఆర్ఎస్ పై పోరాటానికి కలిసి వచ్చే పార్టీలతో పనిచేయాలని అనేక విధాలుగా ప్రయత్నాలు సాగిస్తున్నారు వైయస్ షర్మిల.ఇక ఈ క్రమంలో వైయస్ షర్మిల ను టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేయడం పరిపాటిగా మారింది. తాజాగా మంత్రి గంగుల కమలాకర్ ఎన్నికలు వస్తున్నాయని మళ్లీ కొంతమంది పాదయాత్ర పేరుతో వస్తున్నారని, తెలంగాణ సంపదను దోచుకోవడానికి ఆంధ్ర వాళ్ళు మళ్ళీ వస్తున్నారని వ్యాఖ్యలు చేశారు.

 sharmilagangulakamalakar

షర్మిలకు మన ఆచార వ్యవహారాలు ఏమి తెలుసని ప్రశ్నించిన మంత్రి గంగుల కమలాకర్, షర్మిలది ఆంధ్ర అంటూ వ్యాఖ్యలు చేశారు. షర్మిల అన్న ఆంధ్ర సీఎం అని.. అసలు షర్మిలకు ఇక్కడేం పని అంటూ మంత్రి గంగుల కమలాకర్ నిలదీశారు. రాష్ట్రంలో అధికారం కోసం కొంతమంది వస్తున్నారని, వారంతా దోపిడీ చేయడానికే వస్తున్నారని ఆయన షర్మిలను ఉద్దేశించి ఆరోపణలు గుప్పించారు.

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వనరులను తరలించుకుపోవడానికి వస్తున్నారని గంగుల కమలాకర్ అనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని మళ్లీ గుడ్డి దీపం చేయాలని చూస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కోసం చాలా మంది వస్తూ పోతూ ఉంటారని, అయితే మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని మంత్రి గంగుల కమలాకర్ సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+