సొల్లు పురాణం వద్దు.. దమ్ముంటే ఆ పని చేయ్ : కిషన్ రెడ్డికి హరీశ్ సవాల్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మతాల మధ్య చిచ్చుపెట్టే భాష బీజేపీ దన్నారు. తెలంగాణ ప్రజల వాడుక భాషనే కేసీఆర్ మాట్లాడారని పేర్కొన్నారు. అడ్డగోలు వాదనలు కాకుండా .. దమ్ముంటే కేసీఆర్ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

 ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయ హోదా ఇప్పించు..

ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయ హోదా ఇప్పించు..

కేంద్రం రాష్ట్రానికి ఒక్క పైసా సాయం చేయలేదని హరీశ్ రావు మండిపడ్డారు. బీజేపీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి దమ్ముంటే తెలంగాణాలోని ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయ ప్రాజెక్టుగా హోదా ఇప్పించాలని సవాల్ విసిరారు. అప్పుడు తామే ఆయనకు సన్మానాలు చేస్తామన్నారు. నదుల అనుసంధానం జరిగితే తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని సొల్లు కబురు చెబుతున్నారని మండిపడ్డారు. కిషన్ రెడ్డి ఏ రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారో అర్థం కావటంలేదన్నారు. తెలంగాణలో నీళ్లను తమిళనాడు, కర్ణాటకకు తీసుకుపోతే మనం సమర్థించాలా ? అని దుయ్యబట్టారు.

 రాజ్యాంగాన్ని మార్చాలనడం తప్పా..

రాజ్యాంగాన్ని మార్చాలనడం తప్పా..


రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమంపై చిత్తశుద్ధి ఉంటే.. కేంద్రం నుంచి రావాల్సిన నిధులను కిషన్ రెడ్డి తీసుకురావాలని హరీశ్ రావు కోరారు. జాతీయ ప్రాజెక్టు, ఐఐటీ, ఐఐఎంలను ఇవ్వమమని కేంద్రాన్ని ఎందుకు అడగడం లేదని నిలదీశారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ రిజర్వేషన్ పెంచాలి.. అది జరగాలంటే రాజ్యాంగాన్ని మార్చాలనడం తప్పా అని కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టు అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు.

 అమ‌రవీరుల గురించి మాట్లాడే అర్హ‌త లేదు..

అమ‌రవీరుల గురించి మాట్లాడే అర్హ‌త లేదు..

తెలంగాణ అమ‌రవీరుల గురించి మాట్లాడే అర్హ‌త కిష‌న్ రెడ్డికి లేదని హరీశ్ రావు మండిపడ్డారు. కేసీఆర్ ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేసి, ఢిల్లీని కూక‌టివేళ్ల‌తో క‌దిలించి తెలంగాణ‌ను సాధించారని అన్నారు. నాడు తెలంగాణ కోసం పోరాటంలో ప్ర‌జ‌ల ప‌క్షాన కిషన్ రెడ్డి నిల‌బ‌డ‌లేదన్నారు. జై ఆంధ్రా ఉద్య‌మానికి నాయ‌క‌త్వం వ‌హించి.. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయ‌కుండా ముఖం చాటేశారని ద్వజమెత్తారు. తెలంగాణ స‌మాజానికి వెన్నుపోటు పొడిచిన ఆయనకు అమ‌రుల గురించి మాట్లాడే నైతిక‌త లేదని మండిపడ్డారు.

 అడ్డగోలు వాదనలు కాదు సమాధానం చెప్పు..

అడ్డగోలు వాదనలు కాదు సమాధానం చెప్పు..


తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టే ఇప్పుడు కేంద్ర మంత్రివి అయ్యావని కిషన్ రెడ్డిపై హరీశ్ ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడితే బల్లలు చరిచారని దుయ్యబట్టారు. కేసీఆర్ అడిగిన మాటలకు సమాధానం చెప్పకుండా అడ్డగోలు వాదనలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ కు వరదలు వస్తే కేంద్రం నుంచి ఒక్క పైసా తెచ్చావా అని కిషన్ రెడ్డిని హరీశ్ నిలదీశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+