ఈటలది భావ దారిద్ర్యం: కేసీఆర్ అధ్యక్షుడే కాదు..గురువు..తండ్రి సమానులు: ప్రాణం ఉన్నంత వరకు : హరీష్..!!

మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యల మీద మంత్రి..టీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు తీవ్రంగా స్పందించారు. ఈటల టీఆర్ఎస్ కు రాజీనామా చేస్తూ హరీష్ రావు సైతం పార్టీలో అనేక అవమానాల ను ఎదుర్కొన్నారని వ్యాఖ్యానించారు. దీనికి స్పందనగా హరీష్..ఈటల మీద మాటల తూటాలు పేల్చారు. త‌న స‌మ‌స్య‌ల‌కు , త‌న గొడ‌వ‌కు నైతిక బ‌లం కోసం ప‌దేప‌దే తన పేరు వాడుకోవటం ఈటల భావ‌దారిద్య్రానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. తన భుజాల మీద తుపాకి పెట్టాలనుకోవటం విఫల ప్రయత్నంగా మిగిలి పోతుందని ఆగ్రహం వ్యక్తం చేసారు.

ఆయన మాటల్లో వికారమే మినహా... సత్యం అనేది లేదని రియాక్ట అయ్యారు. తన గురించి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పుకొచ్చారు. ఈటల పార్టీని వీడటానికి ఆయనకు అనేక కారణాలు ఉండవచ్చని హరీష్ వ్యాఖ్యానించారు. ఈటల పార్టీకి చేసిన సేవల కన్నా..ఇచ్చిన అవకాశాలే ఎక్కువ అంటూ హరీష్ సీరియస్ అయ్యారు. పార్టీలో ఉంటారో...వెళ్లిపోతారో ఆయన ఇష్టమన్నారు. టీఆర్ఎస్‌ పార్టీలో తాను నిబ‌ద్ద‌త, విధేయ‌త‌, క్ర‌మ‌శిక్ష‌ణ ఉన్న‌ కార్య‌క‌ర్త‌ను అని. పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వ‌ర‌కు నాకు పార్టీ ప్ర‌యోజ‌నాలే ప‌ర‌మావ‌ధిగా ప‌నిచేస్తున్న‌ట్లు హ‌రీష్ రావు తెలిపారు.

Minister Harish Rao reacts seriously over Eetala for taking his name

ప్రాణం ఉన్నంత వరకు కేసీఆర్ మాట జవదాటకుండా నడుచుకుంటానని హరీష్ తేల్చి చెప్పారు. పార్టీలో..ప్రభుత్వంలో అనేక మంది అవమానాలు భరిస్తున్నారని ఈటల చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ కాదని..బానిస భవన్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. దీని పైన ఇప్పటికే పలువురు మంత్రులు రియాక్ట్ అవుతూ ఈటలను తప్పు బట్టారు. తాజాగా హరీష్ సీరియస్ కావటంతో ఇది కొత్త మలుపు తీసుకోనుంది. ఈటల సొంత నియోజకవర్గంలో పార్టీ చెదిరి పోకుండా నిలబెట్టే బాధ్యత సైతం ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి హరీష్ కే అప్పగించారు. వచ్చే వారం రెండు రోజుల పాటు హరీష్ హుజూరాబాద్ లో పర్యటించనున్నారు. ఆ సమయంలో పలు కీలక మార్పులు జరిగే అవకాశం ఉందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+