కరోనా: వైరస్‌తో పోరాడుతోన్న కుటుంబానికి మంత్రి హరీశ్‌రావు పరామర్శ.. అండగా ఉంటామని భరోసా

కరోనా వైరస్ తెలంగాణ రాష్ట్రంలో విజృంభిస్తోంది. రాష్ట్రంలో 333కి పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్యారోగ్య శాఖ తెలిపింది. వైరస్ గురించి ఇప్పటికే ప్రజలకు అధికారులు, పోలీసులు, సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు. తాజాగా పాజిటివ్ బాధితుల కుటుంబాన్ని మంత్రి హరీశ్ రావు పరామర్శించారు. ఆపత్కాలంలో ప్రభుత్వం అండగా ఉంటుందని హామీనిచ్చారు.

Recommended Video

    Telangana Minister Harish Rao Interacting With A Villager

    సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మయూరీనగర్‌లో ఓ కుటుంబానికి కరోనా పాజిటివ్ సోకింది. కుటుంబానికి చెందిన తండ్రీ, కొడుకులు హైదరాబాద్‌లో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం సాయంత్రం వారిని గాంధీ ఆస్పత్రిలో గల ఐసోలేషన్ వార్డుకు తరలించే అవకాశం ఉంది. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో కలిసి మంత్రి హరీశ్ రావు కుటుంబసభ్యులను పరామర్శించారు.

    minister harish rao visit coronavirus Affected family

    కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత వైరస్ గురించి స్థానికులు మంత్రి హరీశ్ రావు అవగాహన కల్పించారు. సామాజిక దూరం పాటించడంతోనే వైరస్‌ను తరిమికొట్టొచ్చని సూచించారు. మయూరీనగర్‌లో పర్యటించి.. పరిస్థితిని సమీక్షించారు. ఆ ప్రాంతాన్ని సోడియం హైపోక్లోరైడ్‌ను స్ప్రే చేయించారు. అత్యవసరమైతే తప్ప.. ఇంట్లో నుంచి బయటకు రావొద్దని సూచించారు. అత్యవసర సమయంలో విధులు నిర్వర్తిస్తోన్న పోలీసు సిబ్బందికి ప్రజలు సహకరించాలని కోరారు. ఆపత్కాలంలో చికిత్స అందిస్తోన్న వైద్య సిబ్బందిని గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలన్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+