రాజలింగం హత్య వెనుక ఆ నలుగురు..!!
సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్య కేసు సంచలనంగా మారుతోంది. ఈ అంశం పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన ఆరోపణలు చేసారు. రాజలింగముర్తి హత్యపై సీబీ సీఐడీతో విచారిస్తామని ప్రకటించారు. సీఎం రేవంత్ ఈ హత్య ఘటన పైన సీరియస్ గా ఉన్నారని మంత్రి చెప్పుకొచ్చారు. 24 గంటల్లోనే దోషులను పట్టుకుంటామని చెప్పారు. ఈ హత్య వెనుక నలుగురు ముఖ్యులు ఉన్నారంటూ కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు సెన్సేషనల్ గా మారుతున్నాయి.
రామలింగమూర్తి హత్య పైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీబీసీఐడీ విచారణకు నిర్ణ యించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసు పైన పోలీసులు విచారణ చేస్తున్నారు. కాగా, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన ఆరోపణలు చేసారు. రాజలింగమూర్తి కేసును ఫాస్ట్రాక్ కోర్టులో విచారణ జరిపిస్తామని చెప్పారు. రాజలింగముర్తిని గండ్ర వెంకట రమణా రెడ్డి హత్య చేయించార ని ఆరోపించారు. ఈ ఘటనవెనక కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఉన్నారని సంచలన ఆరోపణలు చేసా రు. అసలు.. వీళ్లు తెలంగాణలో ఎలా పుట్టారో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు.

హత్యా రాజకీయాలు తెలంగాణ సంస్కృతి కాదని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ నేతలు హత్యా రాజకీ యాలను మానుకోవాలని సూచించారు. దోపిడీని ప్రశ్నిస్తే హత్య చేసే స్థాయికి దిగజారారని తీవ్ర వ్యాఖ్యలు చేసారు. మేడిగడ్డ అక్రమాలపై రాజలింగమూర్తి కోర్టులో పోరాడుతున్నాడని తెలిపారు.
ఉద్యమం సమయంలో నీళ్లు పోసుకుని పెట్రోల్ అని చెప్పి అమాయకులు చనిపోవడానికి హరీష్ కారణం అయ్యారని దుయ్యబట్టారు.
రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారి ప్రెస్ మీట్ గాంధీ భవన్ https://t.co/MF9Otu17AO
— Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) February 20, 2025
అడ్వకేట్ వామన రావును హత్య చేసిన వాళ్ళకే కేసీఆర్ టికెట్ ఇచ్చారని చెప్పుకొచ్చారు. రాజలింగమూర్తి హత్యను డైవర్ట్ చేసేందుకు హరీష్ రావు కృష్ణా నీళ్ల గురించి మాట్లాతున్నారని చెప్పుకొచ్చారు. రాజలింగముర్తి హత్యను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications