కూతురు కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ స్పందన ఇదే!
తెలంగాణా రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కొండ సుస్మిత వ్యాఖ్యల దుమారం చిలికి చిలికి గాలివానగా మారింది. కొండా సురేఖ సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటివరకు సుస్మిత చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకులు చాలామంది ఖండించారు. కొండా సురేఖ కూడా కుమార్తె చేసిన వ్యాఖ్యలను ఖండించాలని డిమాండ్ చేశారు.
కూతురు చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికీ నోరు విప్పని మంత్రి సురేఖ
అయితే ఇప్పటివరకు కొండా సురేఖ ఆ విషయంపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తాజాగా మంత్రి కొండా సురేఖ వరంగల్ లో రంగశాయిపేటలో నిర్వహించిన వనమహోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు వివాదంపై ప్రశ్నించే ప్రయత్నం చేశారు. దీంతో ఆమె కూతురు కొండా సుస్మిత సీఎం రేవంత్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై స్పందించలేనని స్పష్టం చేశారు. అసలు ఈ వివాదంపై తాను ఏమీ మాట్లాడనని సురేఖ పేర్కొన్నారు.

మౌనం వహించటం పరోక్షంగా కూతురు వ్యాఖ్యలకు మద్దతు తెలపటమే
సుస్మిత చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారినా, పరిస్థితులు ఎలా మారుతున్నా సురేఖ మాత్రం తన కుమార్తె చేసిన వ్యాఖ్యలు తప్పు అని, ఆ వ్యాఖ్యలను ఖండించటం లేదు, కూతురు చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతం, తనకు సంబంధం లేదని మాత్రమే చెప్పారు. కొండా తీరుపై పార్టీలో అసంతృప్తి వ్యక్తమవుతుండగా, సురేఖ మాత్రం ఈ అంశంపై ఇంకా మౌనం వహించటం, ఆమె కూడా కూతురు చేసిన వ్యాఖ్యలకు పరోక్షంగా మద్దతు తెలిపినట్టే భావిస్తున్నారు.
వన మహోత్సవంలో కూతురు వ్యాఖ్యలపై ఒక్క మాట కూడా మాట్లాడని కొండా సురేఖ
తాజాగా వనమహోత్సవంలో కూడా వివాదం గురించి మాట్లాడకుండా తప్పించుకున్నారు. సుస్మిత వ్యాఖ్యలు, షోకాజ్ నోటీసు, మంత్రి సమాధానం, ఇప్పటివరకు కూతురు చేసిన వ్యాఖ్యలు తప్పు అని ఖండించకపోవడం వంటి అన్ని అంశాలు కలిసి రాజకీయ చర్చలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ వివాదం పార్టీలో మరిన్ని సంచలనాలకు దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కొండా సురేఖ తీరుతో పార్టీ క్రమశిక్షణా చర్యల కోసం నాయకుల నిరీక్షణ
మరి ఈ వ్యవహారంలో ఒకవేళ కొండా సురేఖ తన కుమార్తె సీఎం పై చేసిన వ్యాఖ్యలు తప్పు అని ఒక్క ఖండన ఇస్తే పర్యవసానం మరోలా ఉండే అవకాశం ఉంది. ఇక మరోవైపు కాంగ్రెస్ పార్టీలోనే కొండా సురేఖ కుటుంబ రాజకీయాలను వ్యతిరేకిస్తున్న నాయకులు ఆమెపై పార్టీ అధిష్టానం తీసుకునే క్రమశిక్షణా చర్యల కోసం ఎదురు చూస్తున్నారు. మంత్రి పదవి నుండి బర్తరఫ్ చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు.













Click it and Unblock the Notifications