ఎవరినీ కలవకుండా ఒంటరిగా మంత్రి కొండా సురేఖ.. మౌనం వెనుక వ్యూహం!

తెలంగాణ మంత్రి కొండా సురేఖపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చలు సాగుతున్నాయి. కాంగ్రెస్ అధిష్టానం కొండా సురేఖను మంత్రి పదవి నుండి తప్పిస్తుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నా, ఆమె పై కఠిన చర్యలకు అధిష్టానం నిర్ణయం తీసుకుంది అని చర్చ జరుగుతున్నా కొండా ఫ్యామిలీ ఈ వ్యవహారంపై స్పందించటం లేదు. మౌనంగా ఏం జరుగుతుంది, తర్వాత ఏం చెయ్యాలి అన్న వ్యూహాల్లో ఉన్నారు.

ఎవరినీ కలవకుండా ఒంటరిగా కొండా సురేఖ

కాంగ్రెస్ అధిష్ఠానం ఆమెపై వేటు వేయడానికి సిద్ధమవుతోందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సురేఖ ఎవరినీ కలవకుండా ఒంటరిగా ఉన్నారు. నిన్నటి నుంచి హనుమకొండ రామ్‌నగర్‌లోని తన నివాసంలో ఉండి అపాయింట్‌మెంట్లు కూడా ఇవ్వడం లేదని సమాచారం. కొండా సురేఖ కుమార్తె సుస్మిత సీఎం రేవంత్‌రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన తర్వాత పరిస్థితి మారింది. సురేఖ తన కూతురి మాటలకు తనకు సంబంధం లేదని వివరణ ఇచ్చినా, బహిరంగంగా ఖండించకపోవడంతో క్రమశిక్షణ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది.

Minister Konda Surekha remains alone at her Hanumakonda residence without meeting anyone Amid Resignation Buzz

స్వచ్చందంగా రాజీనామా చెయ్యాలని సూచన

అధిష్ఠానం ఇంకా అధికారిక నిర్ణయం ప్రకటించలేదు. కానీ నిర్ణయం పీసీసీకి చేరింది. అయితే కొండా సురేఖను మంత్రిగా తప్పించాలని నిర్ణయం తీసుకున్నట్టు, ఆమెను స్వచ్చందంగా పదవికి రాజీనామా చేస్తే బాగుంటుందని సూచన చేసినట్టు తెలుస్తుంది. కొండా సురేఖ తనకై తాను మంత్రి పదవికి రాజీనామా చేసే ఆలోచనలో లేరు.. అందుకే తర్వాత పరిణామాలు ఏం జరుగుతాయో చూద్దామని ప్రస్తుతం మౌనం పాటిస్తున్నారు.

సురేఖపై వేటు పడితే... పెద్ద చర్చ

కాంగ్రెస్ వేటు వేస్తే సురేఖ పార్టీ మారతారని కొందరు, బీసీ నినాదంతో కొత్త పార్టీ పెడతారని మరికొందరు చర్చ చేస్తున్నారు. కొండా సురేఖపై వేటు పడితే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందని కొందరు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే కొండా దంపతులు ఇప్పటివరకు ఎలాంటి స్పందన ఇవ్వకపోవడం, కనీసం కుమార్తె వ్యాఖ్యలను ఖండించకపోవడం వారి వ్యూహం ఏమిటో అంతు చిక్కటం లేదన్న అభిప్రాయం ఉంది.

విద్యార్థుల కోసం యంగ్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ లు.. తల్లిదండ్రులకు శుభవార్త!
విద్యార్థుల కోసం యంగ్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ లు.. తల్లిదండ్రులకు శుభవార్త!

కొండా వ్యూహం ఏంటి?

ప్రస్తుతం కొండా ఫ్యామిలీ ఒంటరిగా ఉండటం, ఎవరితోనూ మాట్లాడకపోవడం రాజకీయ వర్గాల్లో మరింత ఊహాగానాలకు దారితీస్తోంది. అధిష్ఠానం నిర్ణయం ఎప్పుడు వస్తుంది? సురేఖ తదుపరి అడుగు ఏమిటి? కొత్త పార్టీ పెడతారా? లేదా వేరే పార్టీలోకి వెళ్తారా? వెళ్తే సురేఖకు ఛాన్స్ ఇచ్చే పార్టీ ఏది? ఈ ప్రశ్నలకు సమాధానం వేచి చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+