అమిత్ షాకు మంత్రి కేటీఆర్ కౌంటర్‌.. మీ ఆధిపత్యం బూమరాంగ్‌ అవుతుందని వార్నింగ్!!

దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ హిందీ భాష పై బీజేపీ మాత్రం తన మంకుపట్టు వీడటం లేదు. వేర్వేరు రాష్ట్రాలకు చెందిన ప్రజలు మాట్లాడుకునే సమయంలో ఇంగ్లీషు, స్థానిక భాషలో కాకుండా హిందీలోనే తప్పక మాట్లాడాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునివ్వడం ఇప్పుడు ప్రతిపక్షాల విమర్శలకు కారణంగా మారింది.

హిందీనే మాట్లాడాలన్న అమిత్ షా .. మండిపడుతున్న ప్రతిపక్షాలు

హిందీనే మాట్లాడాలన్న అమిత్ షా .. మండిపడుతున్న ప్రతిపక్షాలు


ఇప్పటికే అమిత్ షా చేసిన వ్యాఖ్యలు భారతదేశ భిన్నత్వంపై దాడి అంటూ ప్రతిపక్షాలు విమర్శలకు దిగాయి. అంతేకాదు హిందీ సామ్రాజ్యవాదం దేశంలో ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి అని ఆందోళన వ్యక్తం చేశాయి. హిందీ మాట్లాడని రాష్ట్రాలపై హిందీని రుద్దటం కోసం బిజెపి ప్రయత్నాలు చేస్తోందంటూ విమర్శలు వెల్లువగా మారాయి. హిందీ భాష అధికార భాష కానీ జాతీయ భాష కాదు అని హిందీని జాతీయ భాషగా చేసే ప్రయత్నాలకు బదులు పెట్రోల్, డీజిల్ ఇతర ధరలు తగ్గించడంపై కేంద్రం ఎందుకు ఆలోచించడం లేదని ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రశ్నిస్తున్నారు.

అమిత్ షా కు మంత్రి కేటీఆర్ కౌంటర్

అమిత్ షా కు మంత్రి కేటీఆర్ కౌంటర్


ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ టీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంటే, తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా హిందీ భాషనే మాట్లాడాలి అంటూ చేసిన వ్యాఖ్యలు మరోమారు బిజెపిని టార్గెట్ చేయడానికి టిఆర్ఎస్ పార్టీ నాయకులకు ఆయుధంగా మారాయి. తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు.

ఏ భాష మాట్లాడాలో దేశ ప్రజలను ఎందుకు నిర్ణయించుకోనివ్వకూడదు


దేశంలో ఏ భాష మాట్లాడాలో, దేశ ప్రజలను ఎందుకు నిర్ణయించుకోనివ్వకూడదు అంటూ అమిత్ షా ను ప్రశ్నించారు. భాషా దురభిమానం, ఆధిపత్యం బూమరాంగ్ అవుతుందని పేర్కొన్న మంత్రి కేటీఆర్ ఏం తినాలో.. ఏం వేసుకోవాలో.. ఎవరిని ప్రార్థించాలో .. మీరే చెబుతారా అంటూ అమిత్ షా ను నిలదీశారు. రాష్ట్రాల సమాఖ్య నిజమైన వసుదైక కుటుంబం అని పేర్కొన్న మంత్రి కేటీఆర్ ముందు తాను భారతీయుడినని, ఆ తరువాత గర్వించదగిన తెలుగు వాడిని, తెలంగాణ వ్యక్తిని అంటూ పేర్కొన్నారు.

ఇంగ్లీషు భాషను నిషేధించడం యువతకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది

ఇంగ్లీషు భాషను నిషేధించడం యువతకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది


నా మాతృభాష తెలుగు అని కేటీఆర్ వెల్లడించారు. ఇంగ్లీష్, హిందీ, కొంచెం ఉర్దూ లో కూడా మాట్లాడగలను అంటూ పేర్కొన్నారు. దేశంలో హిందీని మాత్రమే మాట్లాడాలి అని చెప్పడం, ఇంగ్లీషు భాషను నిషేధించడం యువతకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. హిందీ భాష విషయంలో అమిత్ షా వ్యాఖ్యలపై కేంద్రం తీరుపై కేటీఆర్ తన ధిక్కార స్వరాన్ని వినిపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+