ఆర్టీసీ బస్సులో నాని పైరసీ సినిమా: ఇలాగేనా? అంటూ కేటీఆర్ ఆగ్రహం

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ బస్సులో పైరసీ చిత్రాల ప్రదర్శనపై మంత్రి కేటీ రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. హీరో నాని నటించిన 'కృష్ణార్జున యుద్ధం' చిత్రాన్ని విడుదలైన మరుసటి రోజే గరుడ బస్సులో ప్రదర్శించడంపై సునీల్ అనే యువకుడు కేటీఆర్‌కు ట్వీట్ చేశాడు.

బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న గరుడ బస్సులో ఈ సినిమాను ప్రదర్శిస్తున్నారంటూ టీవీ స్క్రీన్‌షాట్‌ను కేటీఆర్‌కు పంపించాడు. అంతేగాక, ప్రభుత్వ సంస్థల్లోనే ఇలాంటి పైరసీ జరిగితే, ఇక పైరసీ నియంత్రించాలని సామాన్యుడిని ఎలా అడుగుతారని ప్రశ్నించాడు.

సునీల్ ట్వీట్‌పై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆర్టీసీ సిబ్బంది బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. ఆర్టీసీ బస్సుల్లో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఎండీని కోరారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana Minister KT Rama Rao on Monday Fired on Krishnarjuna Yuddham Movie Piracy in TSRTC buses.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి