ఖాళీగిన్నెల మోతలా బీజేపీతీరు.. మునుగోడు ఉపఎన్నిక, వచ్చేఎన్నికల పొత్తులపైనా మంత్రి కేటీఆర్

నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆస్క్ కేటీఆర్ ప్రోగ్రాంను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి కేటీఆర్ కు నెటిజన్ల నుండి భారీ స్పందన వచ్చింది. రెండు గంటల్లోనే ట్విటర్లో టాప్ ట్రెండింగ్ లో ఆస్క్ కేటీఆర్ కార్యక్రమం నిలిచింది. ఇక ఈ కార్యక్రమంలో నెటిజన్లు అడిగిన అనేక ప్రశ్నలకు కేటీఆర్ ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. కేంద్రంలోని బిజెపి సర్కార్ పై కెసిఆర్ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

డిస్ ప్లే పిక్చర్ మారిస్తే ఏమీ మారదు .. మోడీ స్టైల్ పై మంత్రి కేటీఆర్

డిస్ ప్లే పిక్చర్ మారిస్తే ఏమీ మారదు .. మోడీ స్టైల్ పై మంత్రి కేటీఆర్

సోషల్ మీడియా డిస్ ప్లే పిక్చర్ మారిస్తే ఏమీ మారదని, జిడిపి పెరిగితేనే దేశానికి మంచి జరుగుతుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి, ప్రభుత్వాలను కూల్చడం మానేసి పడిపోతున్న రూపాయిపై ముందు దృష్టి సారించాలని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పేదలకు అందించే ఉచిత పథకాలపై సరైన దృక్పథం, ప్రాధాన్యత ఉంటే మంచిదని పేర్కొన్న ఆయన, ప్రధాని నరేంద్ర మోడీ పేదలకు సాయం చేయడం మానేసి కార్పొరేట్ సంస్థలకు రెండు 12లక్షల కోట్ల రుణమాఫీ చేశారంటూ మంత్రి కేటీఆర్ దుయ్యబట్టారు. మోడీ స్టైల్ ఇలా ఉంటుంది అంటూ కేటీఆర్ చురకలంటించారు.

వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ పొత్తులపై స్పందించిన మంత్రి కేటీఆర్

వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ పొత్తులపై స్పందించిన మంత్రి కేటీఆర్

రెండు గంటల పాటు నెటిజన్లు అడిగిన అనేక ప్రశ్నలకు అంతే స్పీడ్ గా సమాధానమిచ్చారు మంత్రి కేటీఆర్. ప్రధాని హైదరాబాద్ వస్తే ప్రోటోకాల్ పాటించలేదు ఎందుకు అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా, అనధికార కార్యక్రమాల కోసం రాష్ట్రానికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి స్వాగతం చెప్పాల్సిన అవసరం లేదని మంత్రి కేటీఆర్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటుంది అన్నదానికి సమాధానంగా, టిఆర్ఎస్ పార్టీ సింగిల్ గా పోటీ చేస్తుందని, తెలంగాణ ప్రజలతోనే తమకు పొత్తు ఉంటుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.

మునుగోడు ఉప ఎన్నికపై మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

మునుగోడు ఉప ఎన్నికపై మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

మునుగోడు ఉపఎన్నిక పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మంత్రి కేటీఆర్, మునుగోడు ఎన్నికల గురించి ఒక నెటిజెన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా, ముందు మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ జారీ కానివ్వండి. నాకు తెలిసినంతవరకు మునుగోడు మరో ఉప ఎన్నిక మాత్రమే, దాంతో ఏం మారుతుంది అంటూ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.

ఖాళీ గిన్నెలకు మోత ఎక్కువ అంటూ బీజేపీ తీరుపై మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు

ఖాళీ గిన్నెలకు మోత ఎక్కువ అంటూ బీజేపీ తీరుపై మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు

బిజెపి నాయకులు రెచ్చిపోయి మాట్లాడుతున్నా ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు అని అడిగిన ప్రశ్నకు ఖాళీ గిన్నెలకు మోత ఎక్కువ అంటూ మంత్రి కేటీఆర్ సమాధానమిచ్చారు. బీజేపీ నేతలు గోబెల్స్ శిష్యులని వ్యాఖ్యానించారు. వారు అసత్య ప్రచారాలు ఎక్కువ చేస్తున్నారంటూ, ద్వేషాన్ని పెంచడంలో సిద్ధహస్తులు అంటూ వ్యాఖ్యానించారు. ఇక బండి సంజయ్ పైనా మంత్రి కేటీఆర్ నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

బండి సంజయ్ పైనా కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు

బండి సంజయ్ పైనా కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు

బండి సంజయ్ స్వయంగా ఇంగ్లీషులో ట్వీట్ చేస్తున్నారా? అని అడిగిన ప్రశ్నకు అది మీరే చెప్పాలి అంటూ మంత్రి కేటీఆర్ సమాధానమిచ్చారు. వచ్చే ఏడాది వివిధ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయని బండి సంజయ్ చేసిన ప్రకటనపై వేసిన ప్రశ్నకు సమాధానంగా ముంగేరి లాల్ కి హసీన్ స్వప్నే అంటూ కేటీఆర్ జోక్ చేశారు. ఇంకా అనేక అంశాలపై కుప్పలు, తెప్పలుగా ప్రజలు అడిగిన ప్రశ్నలకు ఆయన ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+