సింహం ఎవరంటూ ఆనంద్ మహీంద్ర ప్రశ్న: కేసీఆరేనంటూ మనవడు హిమాన్షు ట్వీట్
హైదరాబాద్: సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర గురువారం ట్విట్టర్ వేదికగా సంధించిన ఓ ప్రశ్నకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ కుమారుడు కల్వకుంట్ల హిమాన్షు స్పందించారు.
Recommended Video

ఇంతకుముందు మహీంద్రా ట్వీట్లకు కేటీఆర్ స్పందించగా...తాజాగా మహీంద్రా ట్వీట్‌కు కేటీఆర్ కుమారుడు స్పందించడం ఆసక్తికరంగా మారింది. చాలాసార్లు ఆనంద్ మహీంద్ర ట్వీట్లకు కేటీఆర్ స్పందిస్తుంటారు. ఆనంద్ మహీంద్ర కూడా కేటీఆర్ ట్వీట్లకు బదులిస్తుంటారు.

కాగా, అన్నింటినీ నిశితంగా పరిశీలిస్తున్న ఓ సింహం ముఖం ఫొటోను పోస్ట్ చేసిన మహీంద్రా... 'నేనేమీ రియాక్ట్ కాను. అయితే అన్నింటినీ నిశితంగా గమనిస్తానని నమ్ము' అన్న వ్యాఖ్యను సింహం చెబుతున్నట్లుగా ట్వీట్ చేశారు. అంతేగాకుండా మీ ఇంటిలో ఈ తరహా కేటగిరీ వ్యక్తి ఎవరంటూ మహీంద్రా ప్రశ్నను సంధించారు.
My grandfather 😅 https://t.co/XVgaCCUv3u
— Himanshu Rao Kalvakuntla (@TheRealHimanshu) August 11, 2022
ఈ ట్వీట్‌కు స్పందించిన హిమాన్షు... 'మా ఇంటిలో అయితే మా తాత గారు (తెలంగాణ సీఎం కేసీఆర్)' అంటూ బదులిచ్చారు. దీనిపై నెటిజన్లు కూడా తమదైన శైలిలో స్పందిస్తున్నారు.












Click it and Unblock the Notifications