పొన్నాల ఇంటికి కేటీఆర్, బంపరాఫర్ - కాంగ్రెస్ పై గురి..!!
తెలంగాణ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికల వేళ పార్టీలు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి. కాంగ్రెస్ కు రాజీనామా చేసిన సీనియర్ నేత పొన్నాలను తమ పార్టీలోకి ఆహ్వానించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఇప్పటికే పొన్నాల తమ పార్టీలోకి వస్తానంటే తాను స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి ఆహ్వానిస్తానని కేటీఆర్ చెప్పారు. ఇప్పుడు అదే జరుగుతోంది. పొన్నాలకు పార్టీలో ఇచ్చే అవకాశాల పైన కేటీఆర్ చర్చించనున్నారు.
పొన్నాల ఇంటికి కేటీఆర్: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య పార్టీకి గుడ్ బై చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ కేబినెట్‌లో మంత్రిగా పని చేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పీసీసీ అధ్యక్షుడిగా పని చేశారు. జనగామ టికెట్ విషయంలో అసంతృప్తితోనే పొన్నాల రాజీనామా చేసినట్లు వెల్లడించారు. రాజీనామా లేఖను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు పంపించారు.

కాంగ్రెస్‌లో తనకు అవమానం జరిగిందంటూ లేఖలో పేర్కొన్నారు. తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో పేద కుటుంబం నుంచి ఈ స్థాయికి వచ్చానని చెప్పిన పొన్నాల... 45 ఏళ్ల తర్వాత తీసుకున్న ఈ నిర్ణయం బాధాకరంగా ఉందన్నారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో అందరికీ తెలిసిన విషయమే అన్నారు. తన విషయంలోనే ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావట్లేదంటూ పొన్నాల భావోద్వేగానికి గురయ్యారు.
బీఆర్ఎస్ లోకి ఆహ్వానం: ఇక, పొన్నాల కాంగ్రెస్ ను వీడటంతో..ఆయన బీఆర్ఎస్ లోకి వస్తానంటే ఆయన ఇంటికి వెళ్లి ఆహ్వానిస్తానని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు పొన్నాల నివాసానికి కేటీఆర్ వెళ్లనున్నారు. పొన్నాలను బీఆర్ఎస్ లోకి ఆహ్వానిస్తారని సమాచారం. ఇప్పటికే పొన్నాల తన రాజకీయ భవిష్యత్ పైన ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. అయితే, పొన్నాలకు జనగాం టికెట్ కాంగ్రెస్ లో రాదని తెలిసిన తరువాతనే రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
నేరుగా రేవంత్ ను టార్గెట్ చేస్తూ ఖర్గేకు రాసిన లేఖలో ఆరోపణలు చేసారు. విల్లాలు ఇచ్చిన వారికి టికెట్లు ఇస్తున్నారని ఆరోపించారు. పార్టీలో సామాజిక న్యాయం కొరవడిందని పేర్కొన్నారు. దీంతో, ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి రాజకీయంగా దక్కే హామీ ఏంటనే చర్చ మొదలైంది.
కేసీఆర్ సమక్షంలో చేరిక: జనగాం సీటు ఇప్పటికే బీఆర్ఎస్ ఖరారు చేసింది. రాజేశ్వర రెడ్డి అక్కడ పోటీకి సిద్దమయ్యారు. ఈ సమయంలో పొన్నాలకు ఆ సీటు ఇవ్వటం సాధ్యపడదనే చర్చ ఉంది. పార్టీలో చేరటం ద్వారా వచ్చే మార్చి లో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానం ఇవ్వటంతో పాటుగా అధికారంలోకి వస్తే ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పగించేలా హామీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
పొన్నాల ఆసక్తి చూపిస్తే రాజ్యసభ ఇచ్చేందుకు సిద్దం అని హామీ ఇస్తారని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. కాంగ్రెస్ కు రాజీనామా చేయటం..ఈ రోజు కేటీఆర్ తో సమావేశం ద్వారా కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న బీసీలను మోసం చేస్తుందనేది బలంగా ప్రచారం చేయాలనేది బీఆర్ఎస్ ఆలోచనగా కనిపిస్తోంది. ఇక, త్వరలో జనగాంలో కేసీఆర్ ఎన్నికల సభలో పొన్నాల అధికారికంగా గులాబీ కండువా కప్పుకుంటారని సమాచారం.
-
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications