రేవంత్‌కు ఆస్తులు ఎక్కడివి, వ్యక్తిగత విమర్శలకు దిగితే ఊరుకోం: మంత్రి లక్ష్మారెడ్డి

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తమపై వ్యక్తిగత విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పార్టీ నేతలను హెచ్చరించారు.ఈ పద్దతిని మానుకోవాలని కాంగ్రెస్ పార్టీ నేతలకు మంత్రి సూచించారు.

బుదవారం నాడు కాంగ్రెస్ పార్టీ మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో సభ నిర్వహించింది. ఈ సభలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంఛార్జీ కుంతియా పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన విమర్శలపై గురువారం నాడు మంత్రి లక్ష్మారెడ్డి, టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్రంగా స్పందించారు.

Minister Laxma Reddy slams on Revanth Reddy and congress leaders

కాంగ్రెస్ పార్టీ నేతలు తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని హితవు పలికారు.రేవంత్‌‌రెడ్డికి అనతికాలంలోనే వేల కోట్ల రూపాయాలు ఎలా వచ్చాయని మంత్రి లక్ష్మారెడ్డి ప్రశ్నించారు. తమపై వ్యక్తిగత విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకొనేది లేదన్నారు.

జడ్చర్లలో కాంగ్రెైస్ పార్టీ నిర్వహించిన సభకు మూడు వేల మంది కూడ హజరుకాలేదని ఆయన చెప్పారు. జడ్చర్ల సభలో కాంగ్రెస్ నేతలు మంత్రి లక్ష్మారెడ్డితో పాటు ఇతరులపై విమర్శలు చేశారు. ఈ విమర్శలకు మంత్రి కౌంటరిచ్చారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana Health minister Laxma Reddy made allegations congress leader Revanth Reddy on Thursday at Hyderabad.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి