పాలమ్మిన స్కూటర్ పై మంత్రి మల్లారెడ్డి షికార్లు

చాలామందికి తమ జీవితంలో పైకి రావటానికి కారమైన అనే విషయాలు ఉంటాయి. అంతేకాదు కొన్ని వాహనాల సెంటిమెంట్ కూడా ఉంటుంది. తాము జీవితంలో ఎదిగిన తర్వాత కూడా ఆ వాహనాలను అమ్మకుండా జాగ్రత్తగా చూసుకుంటారు. వాటిని చాలా భద్రంగా కాపాడుకుంటారు. ఆ వాహనాల ద్వారా తమ గతాన్ని మర్చిపోకుండా ఉంటామని, ఆ వాహనం తమకు సెంటిమెంట్ అని చెప్తారు.అలా సెంటిమెంట్ వాహనాన్ని దాచుకున్న వ్యక్తి మంత్రి మల్లారెడ్డి.

తాజాగా ఆయనకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్ అవుతుంది. మంత్రి మల్లారెడ్డి.. ఈ పేరు చెప్పగానే ప్రతి ఒక్కరికి ఆయన మాట్లాడే మాటలు, ఆయన వేసే డాన్సులు, ఆయన చేసే వివాదాస్పద వ్యాఖ్యలు కచ్చితంగా గుర్తుకొస్తాయి. మంత్రి మల్లారెడ్డి ఏది చేసినా సంచలనమే. తెలంగాణ రాజకీయాలలో ఆయనకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు.

Minister Mallareddy halchal on his old scooter which is used for his milk business

మంత్రి మల్లారెడ్డి తాను చేసిన పాలమ్మినా... పూలమ్మినా .. బోర్ వెల్స్ నడిపించినా .. కష్టపడ్డా .. అన్న వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక తాజాగా మంత్రి మల్లారెడ్డి విజయదశమి నాడు ఆయుధ పూజలో పాల్గొన్నారు. బోయిన్ పల్లిలో ఆయుధ పూజ సందర్భంగా ఆయన తన పాత స్కూటర్ కు కూడా పూజ చేశారు .

గత స్మృతులను గుర్తుకు తెచ్చుకొని నాడు తాను పాలమ్మిన కాలంనాటి స్కూటర్ ను బయటకు తీసి, దానికి పూజలు చేసి ఆ స్కూటర్ పై హల్చల్ చేశారు. మంత్రి మల్లారెడ్డి విజయదశమి సందర్భంగా 40 ఏళ్ల నాటి జ్ఞాపకాలను మళ్లీ గుర్తు చేసుకున్నారు. తాను యువకుడిగా ఉన్నప్పుడు ఉపయోగించిన స్కూటర్ కు పూజ చేసిన ఆయన ఆ స్కూటర్ పై చక్కర్లు కొట్టి ఫోటోలకు ఫోజులిచ్చారు.

మరోసారి తాను పాలమ్మి ఈ స్థాయికి వచ్చిన విషయాన్ని మంత్రి మల్లారెడ్డి గుర్తు చేసుకున్నారు. ఇక మల్లారెడ్డి స్కూటర్ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. మల్లారెడ్డి ఇప్పుడు ఎంత ఎత్తుకు ఎదిగినా ఆయన తాను మొదలెట్టిన తన వ్యాపార ప్రస్థానాన్ని మర్చిపోలేదని, ఆయన స్కూటర్ ఫోటోలు చూసిన వారు చెప్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+