తెలంగాణలో భూముల ధరలకు రెక్కలు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్రంలో LRS స్కీంపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎల్‌ఆర్‌ఎస్ గడువు పొడిగించాలనే ఆలోచన ఇప్పటికైతే లేదని స్పష్టం చేశారు. ఎల్‌ఆర్‌ఎస్ గడువు మార్చి 31, 2025 లోపు చేసుకున్న వారికి 25 శాతం ఇస్తున్నామని తెలిపారు. ప్రజల్లో LRS స్కీంపై ఆశించిన మేర స్పందన ఉందన్నారు. ఈ మేరకు అసెంబ్లీ ఆవరణలో పొంగులేటి మీడియాతో మాట్లాడారు.
తెలంగాణలో త్వరలో భూ వ్యాల్యూ పెంచబోతున్నామని ఈ మేరకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. త్వరలో భూ సర్వే కోసం ప్రతీ మండలానికి సర్వేయర్, డిప్యూటీ సర్వేయర్‌ను నియమిస్తామన్నారు. లైసెన్డ్ సర్వేయర్లకూ ట్రైనింగ్ ఇచ్చి అవకాశం కల్పిస్తామన్నారు. మరోవైపు అసైన్డ్ భూములు అమ్ముకోవడానికి అవకాశం లేదని, భూముల రిజిస్ట్రేషన్‌కు సర్వే మ్యాప్ తప్పనిసరి అని అన్నారు. భూమికి మ్యాప్ లేని వాళ్లకు కూడా సర్వే చేయించి నిర్ధారిస్తామని స్పష్టం చేశారు.

సాదా బైనామాలపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు చేశారు. సాదాబైనామాల విషయంలో కొత్త దరఖాస్తు లను స్వీకరించేదిలేదన్నారు. పాత దరఖాస్తులలో 13 లక్షల అప్లికేషన్లను గత ప్రభుత్వం రిజక్ట్ చేసిందని.. దరఖాస్తు తిరస్కరణకు గురైనవారు అప్పిలేట్ ఆథారిటిలో అప్పీల్ చేసుకోవచ్చని తెలిపారు. ప్రధాని అవాస్ యోజన కింద అర్బన్ ఏరియాలో 1 లక్ష 13 వేల ఇళ్లను మంజూరు చేశామని చెప్పారు. అర్బన్ ఏరియాలో కట్టే ఇళ్లకు కేంద్రం రూ.1.50 లక్షలు మాత్రమే ఇస్తుంది.. మిగతాది రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోందని తెలిపారు. రూరల్ ఏరియాకు సంబందించి కేంద్రం ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications