Ponnam Prabhakar: ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మంత్రి పొన్నం ప్రభాకర్..
రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఆయనతో పాటు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కూడా ఆర్టీసీ బస్సులో వెళ్లారు. మంత్రి పొన్నం వేములవాడ నుంచి సిరిసిల్లకు బస్సులో ప్రయాణం చేశారు. అంతకుముందు పొన్నం ప్రభాకర్ తిప్పపూర్ బస్టాండ్ నుంచి రాజరాజేశ్వర ఆలయం వరకు బైక్ నడిపారు. గుడి దగ్గర ఓ హోటల్లో మంత్రి ఎమ్మెల్యేతో కలిసి ఛాయ్ తాగారు. స్థానికులతో ముచ్చట పెట్టారు. ఆ పక్కనే ఉన్న ఫొటో స్టూడియోలో ఫొటోలు దీగారు.
ఆ తర్వాత ఆటోలో తిప్పపూర్ బస్టాండ్ చేరుకున్నారు. సిరిసిల్ల వెళ్లే బస్సు ఎక్కారు. టికెట్ కొని సిరిసిల్ల వరకు ప్రయాణం చేశారు. ఈ క్రమంలో ఓ మహారాష్ట్ర మహిళ మంత్రితో మాట్లాడారు. ఉచిత బస్సు పథకం బాగుందని చెప్పారు. సిరిసిల్ల పాత బస్టాండ్ వద్ద కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డితో కలిసి టీ తాగారు. స్థానికులతో కలిసి మాట్లాడారు. సిరిసిల్లను మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. లోక్ సభ ఎన్నికలు ముగిసిన తర్వాత ఆసరా పెన్షన్లను రూ.4 వేలకు పెంచుతామని చెప్పారు.

ఎన్నికల కోడ్ ముగియగానే ఇచ్చిన హామీలు అమలు చేస్తామని చెప్పారు. రైతులకు రూ.2 లక్షల రుణ మాఫీ, కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని చెప్పారు. దేశ ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టి బీజేపీ మరోసారి అధికారంలోకి రావాలని చూస్తోందని విమర్శించారు.












Click it and Unblock the Notifications