కేసీఆర్.. ఫాంహౌస్‌లో అవే కలలు కనండి!

రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందంటూ ఆ పార్టీ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి సీతక్క స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 'మీ కార్యకర్తలను ఊహలోంలోనే ఉంచండి.. మీరు ఫాంహౌజ్‌లోనే ఉండండి' అంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సీతక్క చురకలంటించారు.

మళ్లీ అధికారంలోకి వస్తామని మీరు ఎప్పటికీ అవే కలలు కంటూ ఉండండి.. మేం మాత్రం ప్రజలకు మంచి పాలన అందించి మళ్లీ అధికారంలోకి వస్తాం అని కేసీఆర్‌ను ఉద్దేశించి సీతక్క వ్యాఖ్యానించారు. ఇక మీరు ఎప్పటికీ అధికారంలోకి రారంటూ కేసీఆర్‌కు మంత్రి స్పష్టం చేశారు. కాగా, శనివారం ఎర్రవల్లి ఫాంహౌస్‌లో రామగుండం నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులతో సమావేశం జరిగింది.

Minister Seethakka counters KCR s comments about coming to power

మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ పాదయాత్ర బృందంతో సిద్దిపేటలోని ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌ సమావేశమైన సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో అధికారం మళ్లీ బీఆర్‌ఎస్‌దేనని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో సింగిల్‌గానే మళ్లీ అధికారంలోకి వస్తామని కేసీఆర్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. బెల్లం ఉన్న దగ్గరకే ఈగలు వస్తాయని, తెలంగాణను దోచుకోవడానికి కొందరు సిద్ధంగా ఉన్నారని కేసీఆర్ ఆరోపించారు. పదేళ్లు తెలంగాణలో ఎలాంటి ఇబ్బందులు లేవని ఇప్పుడు సమస్యల వలయంలో చిక్కుకుందని ఆరోపించారు. నరేంద్ర మోడీ తన మెడపై కత్తి పెట్టినా తాను వెనకడుగు వేయలేదని కేసీఆర్ చెప్పుకొచ్చారు.

తెలంగాణ కోసం ఎప్పటికైనా పోరాడేది బీఆర్‌ఎస్‌ మాత్రమేనని కేసీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ నోటికొచ్చిన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, ఈ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అందరూ ఒక్కో కేసీఆర్‌లా తయారు కావాలని.. తెలంగాణ హక్కుల కోసం పోరాడాలని ఈ మాజీ సీఎం పిలుపునిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+