బర్తరఫ్ అందుకే.. కొండా సురేఖ బ్లాక్ మెయిల్ వ్యాఖ్యలకు మంత్రి సీతక్క కౌంటర్!
తెలంగాణా రాష్ట్రంలో కొండా సురేఖ బర్తరఫ్ వ్యవహారంపైన ఇంకా రాజకీయ రగడ కొనసాగుతూనే ఉంది. కొండా సురేఖను తెలంగాణ మంత్రివర్గం నుంచి తొలగించిన తర్వాత మంత్రి కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానాన్ని బ్లాక్ మెయిల్ చేసి బీసీ మహిళామంత్రి అయిన నాపై కక్ష పూరితంగా బర్తరఫ్ కు పాల్పడ్డారని ఆరోపించారు. అధిష్టానం తనతో ఒక్క మాట కూడా చెప్పలేదని, తనకు తెలీకుండానే తనను బర్తరఫ్ చేశారని భగ్గుమన్నారు.
కొండా సురేఖ వ్యాఖ్యలకు మంత్రి సీతక్క కౌంటర్
దీంతో రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేశారు, అందుకే అధిష్టానం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అని కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు మంత్రి సీతక్క గట్టి కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి బ్లాక్‌మెయిల్ వల్లే అధిష్ఠానం తనను బర్తరఫ్ చేసిందని సురేఖ అన్నారన్న సీతక్క, అధిష్ఠానం బ్లాక్‌మెయిల్‌కు భయపడేంత బలహీనంగా లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధిష్టానం ఎవరికీ భయపడదని స్పష్టం చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి పై వ్యాఖ్యలు చేయడం వల్లే ఈ నిర్ణయం
ఓ న్యూస్ ఛానల్‌తో మాట్లాడుతూ సీతక్క, సీఎం రేవంత్ రెడ్డి పై వ్యాఖ్యలు చేయడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఎవరైనా పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని, అధిష్ఠానం తీసుకున్న నిర్ణయమే తుది నిర్ణయం అని మంత్రి సీతక్క అభిప్రాయం వ్యక్తం చేశారు. క్రమశిక్షణతోనే పార్టీకి గౌరవం ఉంటుందని గుర్తు చేశారు. సమస్యలు ఉంటే అంతర్గతంగా చర్చించుకోవాలని సలహా ఇచ్చారు.
బీఆర్ఎస్ నేతలు భుజాలు ఎగరేస్తున్నారని సీతక్క ఫైర్
రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనను గౌరవించాల్సిన బాధ్యత అందరి మీదా ఉంటుందని మంత్రి సీతక్క అభిప్రాయం వ్యక్తం చేశారు. పార్టీ లైన్ దాటి ఎవరూ మాట్లాడకుండా ఉంటేనే మంచిది అన్నారు.కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలపై బీఆర్ఎస్ నేతలు భుజాలు ఎగరేస్తున్నారని, ముందు మీ పార్టీ పరిస్థితి చూసుకోవాలని సీతక్క విమర్శించారు.
కవితను ఎందుకు బయటకు పంపారో కేటీఆర్ సమాధానం చెప్పాలన్న సీతక్క
కవితను ఎందుకు బయటకు పంపారో కేటీఆర్ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ముందు బీఆర్ఎస్ నేతలు మీ పంచాయితీ చూసుకోవాలని సెటైర్ వేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న అందరూ పార్టీ బలోపేతం కోసం అందరూ కలిసి పని చేయాలని కూడా పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్‌లోని అంతర్గత చర్చకు కారణమయ్యాయి.












Click it and Unblock the Notifications