మహిళలకు సీతక్క శుభవార్త..త్వరలో మీరే లక్షాధికారులు!

తెలంగాణ రాష్ట్రంలోని మహిళలకు మంత్రి సీతక్క శుభవార్త చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని చెప్పిన ఆమె మహిళా సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టిందని పేర్కొన్నారు. కోటి మంది మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి వారిని కోటీశ్వరులుగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు అన్ని విధాలుగా ప్రభుత్వం చేయూతని ఇస్తుందని సీతక్క తెలిపారు.

హైదరాబాద్ తరహాలో రాష్ట్రంలో మరిన్ని మహిళా శక్తి బజార్లు
రాష్ట్రంలో మహిళా శక్తి విషయంలో ఆమె శుభవార్త చెప్పారు. గ్రామీణ ప్రాంతాల ఉత్పత్తులు, అమ్మకాలు మరియు ప్రచారం కోసం మాదాపూర్ శిల్పారామంలో ఏర్పాటు చేసిన మహిళా శక్తి బజార్ తరహాలో హైదరాబాద్ నగరంలో మరిన్ని మహిళా శక్తి బజార్లను ఏర్పాటు చేస్తామని సీతక్క తెలిపారు. గ్రామీణ మహిళలు ఉత్పత్తి చేసే వస్తువులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని సీతక్క హామీ ఇచ్చారు.

minister seethakka said good news to shg women mahila shakti bazars in hyderabad

గ్రామీణ ఉత్పత్తులను నేరుగా మహిళలు విక్రయించే వేదికలు
నిన్న హైదరాబాద్లోని ప్రజా భవన్ లో జరిగిన మండల సమాఖ్య నూతన అధ్యక్షులు రాష్ట్రస్థాయి సదస్సులో పాల్గొన్న మంత్రి సీతక్క స్వయం సహాయక సంఘాల బలోపేతంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రామీణ ఉత్పత్తుల అమ్మకాలు, ప్రచారం కోసం మహిళా శక్తి బజార్లను ఏర్పాటు చేస్తామని చెప్పిన సీతక్క మహిళలు తయారు చేసిన అనేక ఉత్పత్తులు, ఆహార ఉత్పత్తులు, ఇతర వస్తువులను నేరుగా విక్రయించడం కోసం ఇవి వేదికగా మారుతాయన్నారు.

రాష్ట్రంలో కోటి మందిని స్వయం సహాయక సంఘాలలో చేర్చే ప్లాన్
దీని ద్వారా మధ్యవర్తుల సమస్యలు ఉండవని, పూర్తి లాభాలు దక్కుతాయని సీతక్క తెలిపారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలను స్వయం సహాయక సంఘాలలో చేర్చడం ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయాలనేది ప్రభుత్వ లక్ష్యమని సీతక్క పేర్కొన్నారు. నవంబర్ 19వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా మహిళా శక్తి బలోపేతం కోసం విస్తృతమైన కార్యక్రమాలు చేపడతామన్నారు.

స్త్రీనిధి రుణాలను సద్వినియోగం చేసుకోవాలి
మహిళల ఆర్థిక , సామాజిక సాధికారత పై అవగాహన కల్పించడం కోసం కృషి చేస్తామన్నారు. మహిళలను ప్రోత్సహించడం, వారికి రుణాలు ఇవ్వడం, వ్యాపారాలు నిర్వహించేందుకు సహాయం చేయనున్నట్టు సీతక్క పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చే స్త్రీనిధి వంటి రుణాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మొత్తంగా సీతక్క మహిళల అభ్యున్నతికి వారికి ఆర్థిక భరోసా ఇవ్వడానికి మరిన్ని కొత్త కార్యక్రమాలను చేస్తామని చెప్పడం స్వయం సహాయక సంఘాల మహిళలకు నిజంగా శుభవార్త.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+