కేటీఆర్ హరీష్‌రావులది ఫ్యూడల్ మెంటాలిటీ: నిప్పులు చెరిగిన మంత్రి సీతక్క

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ఇందిరమ్మ చీరల' పంపిణీ కార్యక్రమంపై బీఆర్‌ఎస్ నాయకులు చేస్తున్న దుష్ప్రచారంపై పంచాయ‌తీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డా. ద‌న‌స‌రి అన‌సూయ సీత‌క్క తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముఖ్యంగా కేటీఆర్, హరీష్ రావుల తీరును ఆమె ఫ్యూడల్ మెంటాలిటీగా అభివర్ణించారు.

సంతోషంగా ఉంటే కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారు
మంత్రి సీతక్క మాట్లాడుతూ, ఇందిరమ్మ జన్మదినం సందర్భంగా రాష్ట్రంలోని ఆడబిడ్డలు, మహిళా సంఘాల సభ్యులు స్వయంగా ఎంపిక చేసుకున్న డిజైన్లు, కలర్స్‌తోనే చీరలను పంపిణీ చేస్తున్నామని స్పష్టం చేశారు.ఆడబిడ్డలు చీరలు తీసుకుని సంతోషంగా ఉంటే, ఆ ఆనందం బీఆర్‌ఎస్ నేతలకు, ముఖ్యంగా కల్వకుంట్ల కుటుంబం కళ్ళకు కనిపించడం లేదని మండిపడ్డారు. మహిళలు ఎదుగుతుంటే, సంతోషంగా ఉంటే ఓర్వలేనితనం కేటీఆర్, హరీష్ రావులదని సీతక్క అన్నారు. వాళ్లు సంతోషంగా ఉంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారని చెప్పిన మంత్రి... వారిది ఫ్యూడల్ మెంటాలిటీ అని తీవ్ర విమర్శలు చేశారు.

minister-seethakka-slams-brs-feudal-mentality-over-indiramma-saree-distribution-row

సిరిసిల్ల నేతన్నలని అవమానించకండి
బీఆర్‌ఎస్ పాలకుల మాదిరిగా తాము ఈ చీరలను సూరత్ లేదా దుబాయ్ నుంచి కిలోల లెక్కన తీసుకురాలేదని మంత్రి సీతక్క ఘాటుగా బదులిచ్చారు.ఈ చీరలు సిరిసిల్ల నేతన్నలు తమ చేతితో స్వయంగా నేసినవని కొనియాడిన సీతక్క... కొందరు బీఆర్‌ఎస్ కార్యకర్తలు, నేతలు కావాలని చీరలు బాగా లేవంటూ మాట్లాడటం సిరిసిల్ల నేతన్నలని అవమానించేలా ఉందని ఫైర్ అయ్యారు. కావాలంటే కేటీఆర్, హరీష్ రావు, కవిత స్వయంగా సిరిసిల్ల వెళ్లి నేతన్నలను వెళ్లి అడగవచ్చని చెప్పారు.రాష్ట్ర ప్రభుత్వం చీరలకు ఎప్పుడు ఆర్డర్ ఇచ్చిందో తెలుసుకోవచ్చని కూడా మంత్రి సవాలు విసిరారు. ఈ 65 లక్షల చీరలకు ఏడాది క్రితమే ఆర్డర్ ఇచ్చామని, అందరికీ ఇచ్చేందుకు మరో 35 లక్షల చీరలకు ఆర్డర్ ఇచ్చామని తెలిపారు.

'కోటి మహిళలు కోటీశ్వరులు'లక్ష్యం
తెలంగాణ ఆడపడుచుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసినా బీఆర్‌ఎస్ నేతలు ఓర్చుకోవడం లేదని మంత్రి సీతక్క అన్నారు. "ఫ్రీ బస్సు పెడితే బ్రేక్ డాన్స్ చేసుకోవాలని, కొట్టుకుంటున్నారని దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు చీరలపై కూడా అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. ఎవరు ఇచ్చిన చీరలు బాగున్నాయో ఆడబిడ్డలను చూస్తే అర్థం అవుతుంది" అని పేర్కొన్నారు.

  • నిబంధనల ఎత్తివేత: గతంలో 60 సంవత్సరాలు పైబడిన వారిని మహిళా సంఘాల నుంచి తొలగించే నిబంధన ఉండేదని, తమ ప్రభుత్వం దాన్ని ఎత్తివేసిందని తెలిపారు.
  • సామజిక చేరిక: "కోటి మంది మహిళలను మహిళా సంఘాలలో చేర్చాలని, వారికి చీర, సారే పెట్టీ ఆహ్వానిస్తున్నాం. ఇందులో తప్పేం ఉంది?" అని ప్రశ్నించారు.
  • ఆర్థిక తోడ్పాటు: మహిళా సంఘాల రుణాలకు ఇప్పటికే రూ. 1300 కోట్ల వడ్డీని చెల్లించామని, భవిష్యత్తులో కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే మహిళల కోసం శిల్పారామంలో మహిళా బజార్‌ను కూడా కేటాయించామని చెప్పారు.

బీఆర్‌ఎస్ నేతలకు విజ్ఞప్తి:
బీఆర్‌ఎస్ నేతలు ఇకనైనా తమ బుద్ధి మార్చుకుంటే మంచిదని హితవు పలికిన మంత్రి సీతక్క...మహిళలకు మంచి జరుగుతుంటే స్వాగతించడం,సంతోషించడం నేర్చుకోవాలని అన్నారు. వాస్తవంగా చీరలలో లోపాలు ఉంటే ఆధారాలతో సూచనలు చేయండిగానీ..దుర్మార్గపు, నీచ రాజకీయాలు చేసి మహిళలను అపహాస్యం చేయొద్దన్నారు. అలా చేసేవారికి ఆడబిడ్డలు బుద్ధి చెబుతారని మంత్రి సీతక్క తీవ్ర హెచ్చరిక చేశారు. మహిళల వివరాలను యాప్‌లో నమోదు చేస్తున్నామని, వారికి భీమా సౌకర్యం కూడా అందిస్తున్నామని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+