కొత్త రేషన్ కార్డుల జారీకి విధి విధానాలపై క్లారిటీ ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్: ప్రజా పాలనలో స్వీకరించే దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలిస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. రేషన్ కార్డులను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. కొత్తవి చేర్చడం, పాతవి తీసేయడం జరగలేదన్నారు. కొత్త రేషన్ కార్డుల జారీకి విధి విధానాలు ఇంకా ఖరారు కాలేదని స్పష్టం చేశారు. లబ్ధిదారుల ఎంపికకు నిబంధనలు రూపొందించాల్సి ఉందన్నారు.

ఆశావాహుల డేటా సేకరణ కోసమే దరఖాస్తుల స్వీకరణ జరుగుతుందన్నారు. ఇప్పటికే పింఛను తీసుకుంటున్న వారు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇల్లు కావాలనుకునేవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన నిరుపేదలను గుర్తించి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. ప్రజావాణిలో ఇప్పటి వరకు 25 వేల దరఖాస్తులు వచ్చాయన్నారు మంత్రి శ్రీధర్ బాబు.

 Minister Sridhar Babu response on new ration card policy issue

కాగా, రేషన్ కార్డు విధి విధానాలు, నిబంధనలంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న వేళ.. మంత్రి శ్రీధర్ బాబు స్పష్టతనిచ్చినట్లు తెలుస్తోంది. ఇది ఇలావుండగా, జీహెచ్ఎంసీ పరిధిలో ప్రజా పాలన నిర్వహణ ఏర్పాట్లపై మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు.

150 డివిజన్లలో ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మంత్రులు తెలిపారు. ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. మరోవైపు, డిసెంబర్ 28వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. మంగళవారం ఆమె హన్మకొండలో పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో తాము ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేసి తీరుతామన్నారు. వంద రోజుల్లో వీటిని ప్రజలకు చేరువ చేస్తామని స్పష్టం చేశారు. అధికారులు విధుల్లో అలసత్వం వహించవద్దని ఆమె తేల్చి చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+