ఆస్కార్ అవార్డు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి గుణపాఠం
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం స్వార్థంగా వ్యవహరించిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు.
RRR సినిమా తెలుగు చలనచిత్ర ఖ్యాతిని చిత్రం విశ్వవ్యాప్తం చేసిందని రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కేంద్రంలో ఉన్న BJP ప్రభుత్వం స్వార్థంగా వ్యవహరించిందని, ఇటువంటి చిత్రాన్ని ఆస్కార్ ఎంట్రీకి పంపించలేదని మండిపడ్డారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్ మాసాబ్ టాంక్ లోని తన కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. FDC చైర్మన్ అనిల్ కూర్మాచలం తో కలిసి మాట్లాడారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ''ఆస్కార్ అవార్డ్‌నును అందుకున్న ఏకైక తెలుగు చలనచిత్రంగా RRR చరిత్రలో నిలిచిపోతుందని, ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు గపాటకు ఆస్కార్ అవార్డు రావడం పట్ల తెలుగు రాష్ట్రాలు, దేశం గర్వపడుతోందన్నారు.

ఆస్కార్ అవార్డ్‌ను అందుకున్న గొప్ప చిత్రం RRRను రూపొందించిన డైరెక్టర్ రాజమౌళి, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, లిరిక్ రైటర్ చంద్రబోస్, గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్, చిత్రంలో పనిచేసిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం తరపున అభినందనలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం తరుపున వారికి సన్మానం చేయబోతున్నట్లు చెప్పారు.
కేంద్రంలోని BJP ప్రభుత్వానికి మొదటి నుంచి కూడా దక్షణాది రాష్ట్రాలు అంటే చిన్నచూపు ఉందని, ఆస్కార్ అవార్డుల కోసం ఎంట్రీ పంపమంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వం గుజరాత్ రాష్ట్రానికి చెందిన సినిమా 'చెల్లో షో'ను ఆస్కార్ ఎంట్రీకి పంపించాని మంత్రి విమర్శించారు. కానీ RRR చిత్రం ఆస్కార్‌కు ఎంపికై వారికి తగిన గుణపాఠం చెప్పిందని, రాజమౌళి కృషితోనే ఆస్కార్ అవార్డ్ దక్కిందన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం చేపట్టిన చర్యలతో సినిమా రంగానికి తెలంగాణ కేరాఫ్ అడ్రస్‌గా మారిందన్నారు. చిత్ర పరిశ్రమకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటూ పరిశ్రమ అభివృద్దికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉంటుంది..'' శ్రీనివాస్ యాదవ్ చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications