సీనియర్ల శాఖల్లో భారీ మార్పులు, రాహుల్ మార్క్ డెసిషన్ - ఎవరికి ఏది..!?
తెలంగాణ మంత్రుల శాఖల్లో భారీ మార్పులు జరుగుతున్నాయి. ముగ్గురు మంత్రుల ప్రమాణ స్వీకారం తరువాత కీలక మార్పుల దిశగా కసరత్తు జరుగుతోంది. రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ పలు అంశాల పైన పార్టీ అధినాయకత్వంతో చర్చించారు. మంత్రులు- శాఖలు.. వారి పని తీరుపై రాహుల్ ఆరా తీసారు. మీనాక్షీ నటరాజన్ ఈ మేరకు నివేదిక ఇవ్వటం తో.. కొత్త మంత్రులతో సహా సీనియర్ల శాఖల్లో మార్పుల పై నిర్ణయం తీసుకున్నారు. ఏ మంత్రికి ఏ శాఖ అనేది ఆసక్తి కరంగా మారుతోంది.
ఎవరికి ఏ శాఖ
తెలంగాణ మంత్రివర్గం పని తీరు పైన రాహుల్ సమీక్షించారు. మంత్రులు తమ శాఖలకు సంబం ధించిన వాటిని ఏ విధంగా నిర్వహిస్తున్నారు.. వారి పని తీరు పైన రాహుల్ నివేదిక కోరారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ పూర్తి సమాచారం రాహుల్ ను సమర్పించారు. ఏ మంత్రులు ఏ శాఖ లు నిర్వహిస్తున్నారు.. ఇప్పటి వరకు సాధించిన పురోగతి పైన ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఆర్థిక, నీటిపారుదల, రెవెన్యూ తదితర ప్రధాన శాఖల పనితీరు పైన ప్రత్యేకంగా వివరాలు అడిగినట్లు పార్టీ నేతల సమాచారం. ఇటీవల జరిగిన విస్తరణలో మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ఆశించి, నిరాశ చెందిన వారి గురించీ అధిష్ఠానంతో రేవంత్ భేటీలో చర్చకు వచ్చినట్లు తెలిసింది.

ఢిల్లీ కేంద్రంగా
కాగా, ఇటీవల ప్రకటించిన పీసీసీ పదవులు, పెండింగ్‌లో ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులపైనా చర్చించినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ ఢిల్లీలో ఉన్న సమయంలోనే మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి హుటాహుటిన హస్తినకు వచ్చారు. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై రెండు బహిరంగ సభలు నిర్వహించాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం నిర్ణయించింది. ఈ సభలకు హాజ రు కావాల్సిందిగా రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గేలను రేవంత్‌రెడ్డి కోరగా.. వారిద్దరూ సానుకూలం గా స్పందించినట్లు తెలిసింది. తరువాత సునీల్ కనుగోలుతో రేవంత్ సుధీర్ఘంగా సమావేశమైనట్లు తెలిసింది. ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్, వివేక్‌కు ఇంకా శాఖలు కేటాయించలేదు. ఈ ముగ్గురికి శాఖల కేటాయింపుతో పాటు మిగతా మంత్రుల శాఖల్లోనూ మార్పులు చేర్పులపై ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
శాఖల్లో మార్పులు
కాగా, ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వద్దే 11 శాఖలు ఉండగా కీలకమైన మున్సిపల్, హోమ్, విద్యాశాఖలు సైతం ఆయనే చూస్తున్నారు. సీనియర్ మంత్రులకు శాఖల్లో మార్పులు చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా ముఖ్యమంత్రి వద్ద ఉన్న హోం శాఖను సీతక్క కు ఇస్తారని సమాచారం. అదే విధంగా విద్యా శాఖ తన వద్దే ఉంచుకోవాలని రేవంత్ భావిస్తున్నారు. మున్సిపల్ శాఖను రెండుగా విభజించనున్నారు. అయితే, మంత్రివర్గంలో ఇంకా మూడు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. అదే సమయంలో.. ఒకరిద్దరు మంత్రుల పైన వేటు ఖాయమని ప్రచారం సాగు తోంది. వీటన్నింటి పైన రేవంత్ తో ఈ రోజు కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది. ముగ్గురు మంత్రుల తో పాటుగా సీనియర్ల శాఖల్లోనూ మార్పుల పైన రాహుల్ సూచనలు చేసినట్లు విశ్వస నీయ సమాచారం. దీంతో.. శాఖల పైన తీసుకునే తుది నిర్ణయం పై ఉత్కంఠ కొనసాగుతోంది.
-
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ షెడ్యూల్ - ఫలితాల డేట్ ఫిక్స్..!!












Click it and Unblock the Notifications