ఓరుగల్లు అందాలు చూసేందుకు వస్తున్న అందాల భామలను చూసేందుకు వరంగల్ వెయిటింగ్!

ఓరుగల్లు అందాలు చూసేందుకు అందాల భామలు వస్తున్నారు. అందుకు తగిన ఏర్పాట్లను చేయటంలో ఓరుగల్లు అధికార యంత్రాంగం నిమగ్నమైంది. ప్రపంచ సుందరీమణులు ఈసారి తెలంగాణలో పోటీలలో పాల్గొంటున్న నేపధ్యంలో వారికి తెలంగాణా చారిత్రక, సాంస్కృతిక వైభవం తెలిసేలా ఆయా ప్రాంతాల సందర్శనకు ఏర్పాట్లు చేసింది తెలంగాణా ప్రభుత్వం.

ఈనెల 14వ తేదీన వరంగల్ పర్యటనకు అందాల భామలు
ఇందులో భాగంగా ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు ఈనెల 14వ తేదీన వరంగల్ పర్యటన నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేయాలని హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్ సత్య శారద అధికారులకు దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ లో నిర్వహించే మిస్ వరల్డ్ పోటీలలో పాల్గొంటున్నసుందరీమణులు వరంగల్ సందర్శన నేపథ్యంలో కాకతీయ కళాసంపద చెంత ప్రపంచ అందాల భామల జిలుగులు చూడాలని ఓరుగల్లు వాసులు కూడా ఎదురు చూస్తున్నారు.

miss world contestants coming to see orugallu beauty Warangal waiting to see them

Take a Poll

సుందరీమణులు సందర్శించే ప్రదేశాల పవర్ పాయింట్ ప్రజెంటేషన్
హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్ సత్య శారద, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సందర్శన ఏర్పాట్లు, భద్రత, పర్యటన ప్రాంతాల వద్ద ఏర్పాట్లపై సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థ షోబోట్ ప్రతినిధులు వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు సందర్శించే ప్రదేశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

వరంగల్, హన్మకొండ పర్యటన సాగుతుందిలా
వరంగల్, హనుమకొండ, జిల్లాల కలెక్టర్లు డాక్టర్ సత్య శారదా, పి. ప్రావీణ్య, మాట్లాడుతూ జిల్లా పర్యటనలో భాగంగా హైదరాబాద్ నుండి హనుమకొండ హరిత కాకతీయ హోటల్ కి చేరుకుంటారని, అక్కడ వారికి స్వాగతం, బతుకమ్మ ఆట పాట కార్యక్రమం ఉంటుందన్నారు. హరిత కాకతీయ నుండి వేయి స్థంబాల దేవాలయానికి చేరుకుని దైవ దర్శనం చేసుకుంటారని, ఆలయం వద్ద బ్యారికేడ్లను ఏర్పాటు చేయాలన్నారు.

కాకతీయులు పాలించిన నేలపై వివిధ దేశాల సుందరీమణులు
ఆలయ విశిష్టతను తెలియజేసేందుకు గైడ్ అందుబాటులో ఉండాలన్నారు. అక్కడ ఫోటో షూట్ కు ఏర్పాట్లు, వాహనాల పార్కింగ్, పారిశుద్ధ్య నిర్వహణ, తదితర ఏర్పాట్లు చేయాలన్నారు.చారిత్రక వేయి స్థంభాల దేవాలయం సందర్శన అనంతరం ఫోర్ట్ వరంగల్ ను సందర్శిస్తారని పేర్కొన్నారు. ఆపై హరిత కాకతీయ కు చేరుకుని హైదరాబాద్ కు బయలుదేరుతారని అన్నారు. కాకతీయులు పాలించిన ఓరుగల్లు చారిత్రక ప్రాంతాలను ప్రపంచ సుందరి పోటీలలో పాల్గొనే సుందరీమణుల సందర్శనపై అందరిలో ఆసక్తి నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+