అనూహ్యంగా యాదాద్రి ఆలయంలో మెరిసిన మిస్ వరల్డ్
మిస్ వరల్డ్- 2024 టైటిల్ ఎగురేసుకెళ్లిన చెక్ రిపబ్లిక్ సుందరి క్రిస్టినా పిజ్కోవా.. తెలంగాణలో ప్రత్యక్షం అయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రఖ్యాతి చెందిన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా చీరెకట్టు.. బొట్టుతో మెరిసిపోయారు.
ప్రపంచ పర్యటనలో భాగంగా భారత్‌కు వచ్చారామె. తెలంగాణలో అడుగు పెట్టారు. ఈ ఉదయం యాదగిరిగుట్ట లక్ష్మీనారసింహుడి ఆలయాన్ని సందర్శించారు. ఆలయ నిర్మాణ శైలికి ముగ్ధులయ్యారు. యాదగిరిగుట్టను సందర్శించడం ఆనందాన్ని ఇస్తోందని, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా నిర్మించారంటూ ప్రశంసించారు. ఆలయాన్ని సందర్శించడం మనశ్శాంతిని కలిగించిందంటూ వ్యాఖ్యానించారు.

ఈ ఏడాది మే 7 నుండి 31వ తేదీ వరకు మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యాన్ని ఇవ్వనుంది తెలంగాణ. భారత్ సహా ప్రపంచం నలుమూలల నుండి 120కి పైగా దేశాలకు చెందిన యువతులు ఇందులో పాల్గొనబోతోన్నారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇది 72వ ఎడిషన్. మిస్ వరల్డ్ ప్రారంభం, ముగింపు వేడుకలు, గ్రాండ్ ఫినాలే మొత్తం హైదరాబాద్‌లోనే ఉండబోతోంది.
దీనికి సంబంధించిన ఓ అధికారిక ప్రకటనను మిస్ వరల్డ్ లిమిటెడ్ చైర్‌పర్సన్, సీఈఓ జూలియా మోర్లే ఇదివరకే విడుదల చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ పర్యాటక మంత్రిత్వ శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్‌ను సైతం కలిశారు. తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యం కావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు.
దీనికి సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించడంలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చారు క్రిస్టినా పిజ్కోవా. యాదాద్రి ఆలయాన్ని సందర్శించారు. ఇది ఆరంభం మాత్రమేనని, తెలంగాణ, ఇక్కడ నిక్షిప్తమై ఉన్న రత్నాల్లాంటి అద్భుత ప్రదేశాలను చూడటానికి అతృతతో ఎదురు చూస్తున్నానంటూ వ్యాఖ్యానించారు.
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు











Click it and Unblock the Notifications