భువనగిరి టు ఖమ్మం: అదృశ్యమైన జైలు సూపరిండెంటెంట్ ఆచూకీ లభ్యం
హైదరాబాద్: బుధవారం అదృశ్యమైన నల్గొండ జిల్లా భువనగిరి సబ్ జైలు సూపరిండెంటెంట్ శ్రీనివాసరావు ఆచూకీ లభ్యమైంది. భువనగిరిలో అదృశ్యమైన శ్రీనివాసరావు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు పోలీసులు గుర్తించారు.
వివరాల్లోకి వెళితే... భువనగిరి సబ్ జైలర్‌గా పనిచేస్తున్న శ్రీనివాసరావుతో పాటు మరో ఇద్దరు గార్డులు కిరణ్, నవీన్‌లపై ఖైదీలకు సహకరిస్తున్నారని ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. ఈ చర్యల్లో భాగంగా రెండు రోజుల క్రితం జైలు సూపరింటెండెంట్ శ్రీనివాసరావును ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేటకు బదిలీ చేశారు.
దీంతో మంగళవారం సాయంత్రం భువనగిరిలోని తన ఇంటి నుంచి ఆఫీసుకు బయల్దేరిన శ్రీనివాసరావు అదృశ్యమయ్యారు. అకారణంగా తనను బదిలీ చేశారని, జైళ్ల శాఖ డీజీ తనను వేధిస్తున్నాడని, ఈ కారణంగా తాను తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకోబోతున్నాంటూ ఓ లేఖ రాసి ఇంట్లో వదిలి వెళ్లారు.
బుధవారం ఉదయానికి ఆయన ఇంటికి రాకపోవడం, శ్రీనివాసరావు ఫోన్ స్విచాఫ్ చేసి ఉండడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై భువనగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఉదయం నుంచి శ్రీనివాసరావు ఆచూకీ కోసం గాలించిన పోలీసులు ఆయన ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు గుర్తించారు.

అసలేం జరిగింది?
భువనగిరి సబ్‌జైలులో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న సిబ్బందిపై ఇటీవలే విడుదలైన ఓ ఖైదీ, జైలర్ డబ్బులు డిమాండ్ చేసి రూ. 350 వసూలు చేశారని ఇచ్చిన ఫిర్యాదు మేరకు డిఎస్పీ దశరథను దీనిపై విచారణ చేపట్టాల్సిందిగా ఆదేశించారు. డిఎస్పీ అందజేసిన నివేదికతో నలుగురు వార్డన్లు నవీన్, కిరణ్‌కుమార్, రాంనర్సయ్య, విజయ్‌కుమార్‌లను బదిలీ చేశారు. అదేవిధంగా జైల్లో అవినీతిని అరికట్టలేకపోయారన్న కారణంతో శ్రీనివాస్‌రావును ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేట జైల్‌కు పంపారు. దీంతో తనను అకారణంగా వేరే జైలుకు అటాచ్ చేశారని మానసిక వేదనకు గురైన శ్రీనివాస్‌రావు అదృశ్యమయ్యారు.
శ్రీనివాసరావు ఘటనపై జైళ్లశాఖ డైరెక్టర్ జనరల్ వికె సింగ్
కాగా శ్రీనివాసరావు ఘటన నేపథ్యంలో జైళ్లశాఖ డైరెక్టర్ జనరల్ వికె సింగ్ స్పందించారు. తెలంగాణ జైళ్లశాఖకు దేశంలోనే అవినీతి రహిత శాఖగా మంచి పేరుందని తెలిపారు. భువనగిరి సబ్ జైలర్ శ్రీనివాసరావుపై అవినీతి ఆరోపణలు రావడంతో బదిలీ చేశామని స్పష్టం చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వానికి లేఖ రాసిన వ్యక్తిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
శ్రీనివాసరావుది బదిలీ కాదు, డిప్యుటేషన్ మాత్రమే: ఐజి
సబ్ జైలర్ అదృశ్యం ఘటన నేపథ్యంలో జైళ్ల శాఖ ఇన్‌చార్జి ఐజి ఆకుల నర్సింహ భువనగిరి సబ్ జైలును సందర్శించారు. బుధవారం జైలులో విచారణ చేపట్టిన ఆయన మీడియాతో మాట్లాడుతూ జైలర్ శ్రీనివాసరావుపై ఆరోపణలు రావడంతో ఆయన్ని డిప్యుటేషన్‌పై ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేటకు పంపామని, బదిలీ కాదని స్పష్టం చేశారు. అతనిపై వచ్చిన ఆరోపణలు నిజం కావని తేలితే తిరిగి భువనగిరి సబ్ జైలుకే కేటాయిస్తామన్నారు.
స్నేహితుడికి సమచారం
ఇంటి నుంచి బయటకు వచ్చిన విషయాన్ని శ్రీనివాసరావు ఖమ్మంలోని స్నేహితుడు రాఘవేంద్రరావుకు తెలియజేశాడు. అయితే రాఘవేంద్రరావు బుధవారం ఉదయం ఖమ్మం బస్టాండ్‌కు వెళ్లేసరికి శ్రీనివాసరావు అపస్మారక స్థితిలో కనిపించాడు. దీంతో వెంటనే అతన్ని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం శ్రీనివాసరావుకు ప్రాణాపాయం లేదని, ఆహారం తీసుకోకపోవడంతో నీరసంతో స్పృహ తప్పిపోయినట్టు వైద్యులు తెలిపారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications