అదృశ్యమైన బీజేపీ నేత తిరుపతి రెడ్డి పీఎస్‌లో ప్రత్యక్షం: ఆ ఎమ్మెల్యేపై సంచలన ఆరోపణ
హైదరాబాద్: నగరంలోని అల్వాల్‌లో అదృశ్యమైన బీజేపీ నేత, రియల్టర్ ముక్కెర తిరుపతి రెడ్డి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు కుటుంబసభ్యులతో హాజరయ్యారు. తిరుపతిని ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. అదృశ్యంపై సమాచారం తెలుసుకుంటున్నారు. గత గురువారం అల్వాల్ తహశీల్దార్ కార్యాలయం ఎదుట తన భర్తను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారంటూ తిరుపతి రెడ్డి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
కాగా, ముక్కెర తిరుపతి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అనుచరులు తనను వెంబడించి.. హత్య చేసేందుకు ప్రయత్నాలు చేశారని తెలిపారు. గత రెండు నెలల నుంచి తన భూమిని అక్రమంగా లాక్కునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని.. సంతకాలు తీసుకోవాలని వెంబడిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై చాలాసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు.

ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అనుచరుల భయానికే తాను విజయవాడకు, అక్కడ్నుంచి విశాఖపట్నంకు వెళ్లానని తిరుపతి రెడ్డి చెప్పారు. మైనంపల్లి అనుచరులు తన భూమిని కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారని.. తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపారు.
మైనంపల్లి తనకు 8 సార్లు ఫోన్ చేశారని తెలిపారు. ఎమ్మెల్యే అనుచరులు బెదిరించడం వల్లే తాను ఆటోలో వెళ్లాల్సి వచ్చిందన్నారు. హైకోర్టు అడ్వకేట్ సలహా మేరకు తాను డీసీపీ ఆఫీసుకు వచ్చానని తిరుపతి రెడ్డి తెలిపారు. కాగా, తిరుపతి రెడ్డి ఆరోపణలు పోలీసులు కొట్టిపారేశారు. ఈ వ్యవహారంతో ఎమ్మెల్యేకు సంబంధం లేదన్నారు.
అంతకుముందు జరిగిన ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. గత గురువారం మధ్యాహ్నం తిరుపతి రెడ్డి కారులో డ్రైవర్‌తో కలిసి అల్వాల్ మండల తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. డ్రైవర్ పని మీద బయటకు వెళ్లి తిరిగి వచ్చే సరికి తిరుపతి రెడ్డి అక్కడ కనిపించకుండా పోయారు.
అతడి రెండు ఫోన్లు రెండు ఫోన్లు స్విచ్ఛాఫ్‌లో ఉన్నాయి. దీంతో ఆయన భార్య సుజాత అల్వాల్ పోలీసులకు గురువారం రాత్రి ఫిర్యాదు చేశారు. స్థల వివాదంతో ప్రత్యర్థి వర్గంలోని వ్యక్తులే తన భర్తను కిడ్నాప్ చేశారని ఫిర్యాదులో సుజాత పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
-
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్












Click it and Unblock the Notifications