ఆదివారం అదృశ్యమైన చిన్నారులు సురక్షితంగా ఇంటికి చేరారు(ఫోటోలు)
హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని వారాసిగూడలో ఆదివారం అదృశ్యమైన ఇద్దరు చిన్నారులు క్షేమంగా ఇంటికి చేరారు. అడిక్‌మెట్‌లో చిన్నారులను గమనించిన చిలకలగూడ పోలీసులు సోమవారం సాయంత్రం వారిని తల్లిదండ్రులకు అప్పగించారు.
అయితే, ఆదివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఇంటి దగ్గర ఆడుకుంటున్న చిన్నారులు ఎలా అదృశ్యమయ్యారో ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. అదివారం ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న చిన్నారులు ఒక్కసారిగా కనిపించలేదు.

దీంతో చిన్నారుల తల్లిదండ్రులు స్ధానికంగా అంతా గాలించారు. ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉదయం పూట చిత్తుకాగితాలు ఏరుకునేవారు అక్కడ కనిపించారనీ ఒకవేళ వారే ఎత్తుకుని వెళ్లి ఉండవచ్చని స్ధానికులు పోలీసులుకు వివరించారు.

ఒకే ఇంటికి చెందిన ఇద్దరు చిన్నారులు అదృశ్యం కావడంతో ఈ సంఘటన స్ధానికంగా ఆదివారం కలకలం సృష్టించింది.












Click it and Unblock the Notifications