కెసిఆర్ వ్యవసాయక్షేత్రం గుండా పైప్‌లైన్: అతీతుడ్ని కాదన్న సిఎం

హైదరాబాద్: మిషన్ భగీరథ (వాటర్‌గ్రిడ్‌) కార్యక్రమంలో భాగంగా గజ్వేల్‌ నియోజకవర్గంలోని జగదేవ్‌పూర్‌ మండలం ఎర్రవెల్లి గ్రామ పరిధిలోని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు వ్యవసాయ క్షేత్రం గుండా పైపులైన్ వేశారు. ఈ పైపులైన్లు రైట్‌ ఆఫ్‌ వే చట్టం ప్రకారం వేస్తున్నట్లు కెసిఆర్‌కు అధికారులు సమాచారం ఇచ్చారు. దానికి ఆయన అంగీకరించారు.

రైట్‌ ఆఫ్‌ వే చట్టం ప్రకారం ఎవరి భూమిలో నుంచైనా పైపు లైను వేసే అధికారం ప్రభుత్వానికి ఉంది. దానికి ముఖ్యమంత్రి అతీతుడు కాదంటూ అధికారులకు కేసీఆర్‌ సహకరించారు. కేసీఆర్‌ భూమిలో పైపులైనను దాదాపు 300 మీటర్ల మేర వేశారు. వెంకటాపురం నుంచి వరదరాజపురం వరకు గొట్టాలు వెళ్లే మార్గంలో కేసీఆర్‌ వ్యవసాయ క్షేత్రంలోని భూమితో పాటు కొంత అల్లం పంటను తొలగించాల్సి వచ్చింది. దీనిని కూడా ముఖ్యమంత్రి అనుమతించి, ఆ పనులను చేయించారు.

గోదావరి నది నుంచి నీళ్లు తీసుకొచ్చే ఈ పైపులైన్ శివారు వెంకటాపురం నుంచి వరదరాజుపురం వరకు వెళ్తున్నది. దీని కోసం కెసిఆర్ వ్యవసాయ క్షేత్రంలో అల్లం పంటను కొంత మేర తొలగించారు. రైతులైనా, ఎవరైనా సరే తెలంగాణ ప్రజలందరికీ మంచి నీరు అందించే మిషన్ భగీరథ కార్యక్రమానికి సహకరించాలని ఈ సందర్భంగా కేసీఆర్‌ కోరారు.

 Mission Bhageeratha pipeline from KCR's farm house

వాటర్ గ్రిడ్ పథకం కింద గజ్వేల్‌ నియోజవకర్గంతో పాటు సిద్దిపేట, దుబ్బాక, వరంగల్‌లోని పాలకుర్తి, స్టేషన్ ఘనపూర్‌, జనగామ, నల్లగొండలోని భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, రంగారెడ్డిలోని మేడ్చల్‌ నియోజకవర్గాలకు ఈ ఏడాది ఏప్రిల్‌ 30 నాటికే మంచినీరు సరఫరా చేయాలనే లక్ష్యంతో అధికారులు పనిచేస్తున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు వ్యవసాయక్షేత్రం నుంచి పైపులైన్‌ పనులు మంగళవారం ప్రారంభమయ్యాయి. మిషన్‌ భగీరథ జిల్లా అధికారి విజయప్రకాశ్‌, గజ్వేల్‌ నియోజకవర్గ అధికారి రాజయ్య ఆధ్వర్యంలో రెండు పొక్లెయిన్లతో పనులు చేపట్టారు. హైదరాబాద్‌కు సరఫరా చేయనున్న ‘అబ్దుల్‌ కలాం సృజల స్రవంతి' తాగునీటి పథకం పైపులైనుకు ప్రజ్ఞాపూర్‌ వద్ద కనెక్షన్‌ తీసుకుని 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న గజ్వేల్‌ మండలం కోమటిబండ గ్రామంలోని గుట్టపై సంపులు నిర్మిస్తున్నారు.

చట్ట ప్రకారం ఎవరి భూమిలోంచైనా గొట్టాలు వేసే అధికారం ఉందని, దీనికి తాను అతీతుడిని కానని ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్పారు. మిషన్ భగీరథ పథకం కింద గొట్టపు మార్గాలకు అవసరమైతే ఎలాంటి భూములనైనా స్వాధీనం చేసుకునేందుకు వీలు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం గతంలోనే ఓ చట్టాన్ని తెచ్చిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+