ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిపై కేసుపెట్టిన కూతురు.. కన్నీరు పెట్టుకున్న ఎమ్మెల్యే
జనగామ ఎమ్మెల్యేకు షాక్ తగిలింది. అదేదో ప్రతిపక్ష నేతల నుండి అనుకుంటే పొరబాటే.. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి సొంత కూతురే షాక్ ఇచ్చారు. ఎమ్మెల్యేపై ఆయన కుమార్తె కేసు పెట్టారు. తన తండ్రి తనను మోసం చేసి తన ఆస్తిని కబ్జా చేశాడని పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు.
ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కుమార్తె తుల్జా భవాని తన తండ్రి తనను మోసం చేసి ,తన సంతకాన్ని ఫోర్జరీ చేసి అక్రమంగా తన పేరు పై ఉన్న ఆస్తి వేరే వారికి అగ్రిమెంట్ చేశారని, అంతేకాక ఎకరం 20 గుంటల భూమిని కబ్జా చేశారని ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

159 గజాల నాచారం ల్యాండ్ కమర్షియల్ బిల్డింగ్ విషయంలో కినారా గ్రాండ్ కు తన తండ్రి అక్రమ అగ్రిమెంట్ చేశాడని, అలాగే ఎకరం 20 గుంటల భూమిని కూడా తన తండ్రి కబ్జా చేశారని ఆమె తండ్రి పైన ఫిర్యాదు చేశారు. సిద్దిపేట జిల్లా చేర్యాల లో తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని ఆమె పేర్కొన్నారు.
తుల్జా భవాని ఫిర్యాదు మేరకు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పై ఉప్పల్ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కుమార్తె భవానీ రెడ్డి ఫిర్యాదు మేరకు ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై 406, 420, 463, 464, 468, 471, R/w34ipc 156(3)crpc సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
భూమి కబ్జా చేశాడు అంటూ కన్నకూతురు కేసు పెట్టడంతో ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కన్నీటిపర్యంతమయ్యారు. తాను ఏ తప్పు చేయలేదని పేర్కొన్నారు. ప్రత్యర్థులు తనను రాజకీయంగా ఎదుర్కోలేక తన బిడ్డతో కేసులు పెట్టించారని ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆరోపించారు. ప్రతి కుటుంబంలో సమస్యలు ఉంటాయని, తన సమస్యను తను ఇంట్లోనే తేల్చుకుంటా అని ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి స్పష్టం చేశారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications