కొత్తగా చేరే పార్టీ, గోషామహల్ బై పోల్ పై తేల్చేసిన రాజాసింగ్..!!
బీజేపీకి రాజీనామా చేసిన రాజాసింగ్ అడుగులు ఎటు. రాజాసింగ్ రాజీనామాను బీజేపీ ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో, బీజేపీ సింబల్ పైన ఎమ్మెల్యేగా గెలిచిన రాజాసింగ్ పై అనర్హత వేటు వేయాలని కోరుతూ స్పీకర్ కు లేఖ రాసేందుకు పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాగా, ఇదే సమయంలో రాజాసింగ్ శివసేనలో చేరుతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. వీటి పైన రాజాసింగ్ స్పష్టత ఇచ్చారు. కొత్తగా చేరే పార్టీతో పాటుగా గోషామహల్ కు ఉప ఎన్నిక అంశం పైన రాజాసింగ్ తేల్చి చెప్పారు.
బీజేపీ నుంచి బయటకు వచ్చిన రాజాసింగ్ రాజకీయ భవిష్యత్ ఏంటి. గోషామహల్ బాధ్యతలను రాజాసింగ్ స్థానంలో మాధవీలత కు ఇస్తారనే ప్రచారం సాగుతోంది. ఈ సమయంలో రాజాసింగ్ స్పష్టత ఇచ్చారు. తాను ఏ పార్టీలో చేరే అంశం పైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. తన ఎమ్మెల్యే పదవి పైన బీజేపీ నాయకత్వానిదే తుది నిర్ణయమని తేల్చి చెప్పారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమని బీజేపీ సూచిస్తే.. తాను సిద్దంగా ఉన్నానని స్పష్టం చేసారు. తాను చివరి శ్వాస వరకు హిందూత్వం కోసం పోరాటం చేస్తానని తేల్చి చెప్పారు. బీజేపీ అధినాయకత్వం పైన తనకు ఎలాంటి వ్యతిరేక భావం లేదని చెప్పుకొచ్చారు.

ఇక, సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో రాజాసింగ్ అమ్మవారిని దర్శించు కొని మొక్కులు తీర్చుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ బోనాల శుభాకాంక్ష లు తెలిపారు.వేలాదిమంది సింహవాహిని అమ్మవారి దర్శనం కోసం వస్తున్నారని చెప్పుకొచ్చారు. యావత్ భారతదేశంలో ఉండే హిందువుల అందరిపై సింహవాహిని అమ్మవారి ఆశీస్సులు ఉండా లని కోరుకున్నానని అన్నారు. దర్శనం అనంతరం ఓ మంత్రి తనతో మాట్లాడారని తెలిపారు. ఏ పార్టీలో ఉన్నా అందరి లక్ష్యం ఒకటేనని, మోడల్ గోశాల కట్టడానికి తన సహకారం కావాలని ఆ మంత్రి తనను కోరారని చెప్పుకొచ్చారు. సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయాన్ని వైభవం గా కడతామని గత ప్రభుత్వాలు గుడిపై రాజకీయం చేశారని విమర్శించారు ఎమ్మెల్యే రాజాసింగ్.












Click it and Unblock the Notifications