కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ కోసం ఎమ్మెల్యే దీక్ష
కల్వకుర్తి: కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్‌గా చేయాలని కోరుతూ అఖిల పక్షం చేపట్టిన దీక్ష న్యాయమైందని, ప్రభుత్వం వెంటనే స్పందించి డివిజన్ ఏర్పాటు చేయాలని కల్వకుర్తి ఎమ్మెల్యే చల్లా వంశీ చంద్ రెడ్డి, మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్‌లు కోరారు.
బుధవారం కల్వకుర్తి పట్టణంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో కల్వకుర్తిని డివిజన్‌గా ఏర్పాటు చేయాలని వంశీచంద్ రెడ్డి నిరవధిక దీక్ష చేపట్టారు. పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి దీక్షకు పలు పార్టీలకు చెందిన నాయకులు, ప్రజలు తరలివచ్చారు.












Click it and Unblock the Notifications